బిగ్ బాస్ షో సీజన్ 5 విన్నర్ అయ్యేది అతనేనా?
TeluguStop.com
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రారంభమైంది.ఈ సీజన్ లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 4పై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ లో ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లకు ప్రాధాన్యత ఇచ్చారు.
వీక్ డేస్ లో ఈ షో రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా వీకెండ్ లో మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండటం గమనార్హం.
బిగ్ బాస్ సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ 4లకు హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ఈ సీజన్ కు కూడా మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి హనుమంత్ ఎంట్రీ ఇవ్వగా సెకండ్ కంటెస్టెంట్ గా వీజే సన్నీ థర్డ్ కంటెస్టెంట్ గా లహరి షారి, ఫోర్త్ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్ర, ఫిఫ్త్ కంటెస్టెంట్ గా అనీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు.
సిక్స్త్ కంటెస్టెంట్ గా లోబో, సెవెన్త్ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ ప్రియ, జశ్వంత్ పాదాల, జబర్దస్త్ ప్రియాంక, షణ్ముఖ్ జశ్వంత్, నటి హమీదా, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సరయు, విశ్వ, కార్తీకదీపం ఉమాదేవి, మానస్ నాగులపల్లి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, చివరి కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు.
అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువగా యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్ లకు ఉందని వినిపిస్తోంది.
"""/"/
షణ్ముఖ్ జశ్వంత్ కు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక షణ్ముఖ్ డల్ గా ఉండటం అతనికి మైనస్ గా మారింది.
మరోవైపు యాంకర్ రవి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలలో ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ కావాలో అవగాహన కలిగి ఉన్నవారిలో ఒకరు.
బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు రవి, షణ్ముఖ్ లకు ఎక్కువగా ఉండగా రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చి ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వదల బొమ్మాళీ వదల అంటూ పుట్టగానే కత్తెర పట్టుకున్న పసిబిడ్డ.. వైరల్ వీడియో!