Shobha Shetty: బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శోభా శెట్టి.. ఊరేగింపులో అభిమాని నుంచి చేదు అనుభవం?

తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్(Bigg Boss) రియాల్టీ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని మరొక నాలుగు రోజులలో ఏడవ సీజన్ కూడా పూర్తికానుంది.

మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో కొనసాగినటువంటి ఈ కార్యక్రమం 14 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

ఈ వారం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతోంది.ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా సీరియల్ ఆర్టిస్టులు యూట్యూబర్స్, సింగర్స్ వంటి వారందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ శోభా శెట్టి (Shobha Shetty) కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈమె హౌస్ లో మోనిత (Monitha) క్యారెక్టర్ లో మునిగి తేలిపోయారు.ఈమె వ్యవహార శైలి చూసినటువంటి వారందరూ కూడా మూడవ వారమే ఈమె హౌస్ నుంచి బయటకు వస్తుందని భావించారు కానీ శోభా శెట్టి బయటకు వస్తే బిగ్ బాస్ కార్యక్రమం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఈమెను 14 వారాలపాటు హౌస్ లో కొనసాగేలా చేశారు.

ఒకానొక సమయంలో ఈమె ఎలిమినేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ వీక్ ఎలిమినేషన్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం ఉంది.

"""/" / ఇక బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరుపొందినటువంటి శోభా శెట్టి చివరికి పద్నాలుగు వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది ఇలా ఈమె 14వ వారం ఎలిమినేట్ కావడంతో ఎంతోమంది పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో పెద్ద ఎత్తున ఆమె అభిమానులు తనని రిసీవ్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్ వద్దకు చేరుకున్నారు.

"""/" / శోభా శెట్టి హౌస్ నుంచి బయటకు రాగానే పెద్ద ఎత్తున తనపై పూల వర్షం కురిపించి తనని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

ఇలా కారులో టాప్ పై ఈమె అందరికీ హాయ్ చెబుతూ ఊరేగింపుగా వచ్చారు.

అయితే అభిమానులను ఉద్దేశించి శోభా శెట్టి(Shobha Shetty) మాట్లాడుతూ బేబీస్ మీ అందరికీ నేను టాప్ లో ఉండటం ఇష్టం లేదేమో అందుకే తనని బయటకు వచ్చేలా చేశారు అంటూ శోభ శెట్టి మాట్లాడారు.

దీంతో ఒక అభిమాని మాత్రం నువ్వు ఎప్పుడూ బయటికి రావాల్సింది ఇప్పుడు వచ్చారు అంటూ శోభాశెట్టికి వినిపించేలా మాట్లాడటం విశేషం.

"""/" / ఇలా ఆ మాటలు విన్నటువంటి శోభా శెట్టి ఒక్కసారిగా డల్ అయ్యారు.

ఇక ఈ వీడియో పై నేటిజన్స్ యధావిధిగా కామెంట్ చేస్తున్నారు.అంటే అన్నాడు గాని చాలా సూపర్ గా, కరెక్ట్ మాట అన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

హౌస్ లో ఉన్నప్పుడు ప్రతిదానికి శోభ శెట్టి ఎంతో ఓవరాక్షన్ చేసేదని ఏది ఏమైనా ఈమె హౌస్ నుంచి బయటకు రావడం చాలా హ్యాపీగా ఉంది అంటూ నెటిజన్స్ చేసినటువంటి కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?