ఖరీదైన కారును కొనుగోలు చేసిన బిగ్ బాస్ షణ్ముఖ్.. కారు ఖరీదెంతంటే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బిగ్ బాస్ షో సీజన్5 లో పాల్గొని వార్తల్లో నిలిచిన కంటెస్టెంట్లలో షణ్ముఖ్ ఒకరు.

వెబ్ సిరీస్ ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ షోలో సైలెంట్ గా ఉండటంతో పాటు సిరితో క్లోజ్ గా ఉండటం ద్వారా విమర్శల పాలయ్యారనే సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైనా షణ్ముఖ్ కు దూరమయ్యారు.

అయితే తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ ఖరీదైన కారును కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఖరీదైన బీఎండబ్ల్యూ కారును షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేశారు.షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేసిన కారు 51 లక్షల రూపాయలు అని సమాచారం.

బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ ను షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేయడం గమనార్హం.

బిగ్ బాస్ సీజన్5 రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం జరుగుతోంది.

షణ్ముఖ్ జశ్వంత్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ మళ్లీ కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

"""/" / దీప్తి సునైనా షణ్ముఖ్ మళ్లీ కలుస్తారో లేదో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ షో ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.

షణ్ముఖ్ జశ్వంత్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

షణ్ముఖ్ జశ్వంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ట్రంప్ ఆర్డర్ ఎఫెక్ట్ .. నాసాలో భారత సంతతి శాస్త్రవేత్తపై వేటు