Shanmukh Jaswanth : బిగ్ బాస్ షణ్ముఖ్ ఇంటిని చూశారా.. స్టార్ హీరోల ఇల్లు కూడా పనికిరావుగా?
TeluguStop.com
సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా ఎంతో టాలెంట్ కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా సెలబ్రిటీలకు మారిపోయారు.
ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్నటువంటి టాలెంట్ వీడియోల రూపంలోనూ తెలియజేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth )కూడా ఒకరు.
ఈయన ఎన్నో రకాల యూట్యూబ్ వీడియోలను చేస్తూ సక్సెస్ అయ్యారు అంతేకాకుండా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
షణ్ముఖ్ యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా ఈయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఈయనకు ఏకంగా బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం కూడా కల్పించారు అయితే బిగ్ బాస్ టైటిల్ సొంతమని అందరూ భావించారు కానీ ఈయన హౌస్ లో వెళ్లి అక్కడ భారీ స్థాయిలో నెగెటివిటీని సొంతం చేసుకోవడంతో విన్నర్ కావాల్సిన షన్ను కాస్త రన్నర్ గా మిగిలిపోయారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అయితే ఇప్పటికి పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. """/" /
ఇక ఈయన కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ స్థాయిలోనే డబ్బు సంపాదించారని చెప్పాలి హీరోలకు ఏ మాత్రం తీసుకోకుండా తన వెబ్ సిరీస్( Web Series ) ల ద్వారా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
ఇలా సెలబ్రిటీ హోదా అందుకున్నటువంటి ఈయనకు హైదరాబాదులోనే కాకుండా విజయవాడలో కూడా ఇల్లు ఉన్న విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా విజయవాడలో ఈయన ఇంటికి సంబంధించినటువంటి హోమ్ టూర్ ( Home Tour ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
ఇక విజయవాడలో ఉన్నటువంటి షణ్ముఖ్ ఇల్లు హీరోల ఇళ్లకు ఏ మాత్రం తీసుపోదని ఈ ఇల్లు ఒక ఇంద్ర భవనంలో ఉందని చెప్పాలి.
ప్రతి ఒక్క రూమ్ కి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పిఓపి తో పాటు విశాలమైనటువంటి లివింగ్ రూమ్ కిచెన్ పూజగది అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈ ఇంట్లో షణ్ముఖ్ జిమ్ ఏరియాతోపాటు ఆయన అవార్డ్స్ అన్నీ కూడా ఎంతో అందంగా అలంకరించి ఉన్నారు.
ప్రస్తుతం ఈయన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షణ్ముఖ్ సెలబ్రిటీల హోదాకు ఏమాత్రం తీసుపోరని అచ్చం సెలబ్రిటీల ఇళ్లను కూడా తలదన్నేలా ఈయన ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది అంటూ పలువురు ఈయన హోమ్ టూర్ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ఇంట్లో షణ్ముఖ్ తల్లిదండ్రులు ఉంటారని అప్పుడప్పుడు వీరు హైదరాబాద్ కి వస్తూ ఉంటారని తెలుస్తుంది.
షణ్ముఖ్ కూడా తనకు షూటింగ్స్ లేని సమయంలో తన తల్లిదండ్రుల వద్దకు వస్తూ వెళ్తుంటారు.
హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!