బిగ్ బాస్ ఆరవ సీజన్.. ప్రేక్షకులు ఇప్పటికే అంతా చూసేసారా?

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది.కార్యక్రమంలోని ప్రతిరోజు ఎపిసోడ్ ని వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.

కానీ ఎందుకో పొరపాటున బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది సీజన్ కు సంబంధించిన ఎపిసోడ్లను కాకుండా గత సీజన్లకు సంబంధించిన ఎపిసోడ్లను ప్రసారం చేస్తున్నారేమో అని అనుమానం ప్రేక్షకులందరిలో కూడా కలుగుతుంది.

కానీ ఇక ఎపిసోడ్లో 6వ సీజన్ కంటెస్టెంట్లు ఉండడంతో ఇక తమకు తాము సర్ది చెప్పుకుంటూ బిగ్ బాస్ ఆరవ సీజన్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది అని భావిస్తున్నారు ప్రేక్షకులు.

ఇంతకీ ప్రేక్షకులలో ఇలాంటి భావన కలగడానికి కారణం ఏంటో తెలుసా.నిర్వాహకుల పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలు, గేమ్స్ మరియు స్కిట్స్ ఇస్తున్న తీరు.

గత సీజన్ లో నామినేషన్లు ఎలా జరిగాయి.టాస్కులు ఎలా కొనసాగాయో.

ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.అలాంటప్పుడు ఇక కొత్త సీజన్ ప్రారంభించడం ఎందుకు అన్నది అందరిలో ఉన్న భావన.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లాంటి పెద్ద షోలకు రేటింగ్ తీసుకురావాలంటే కాస్త కొత్తగా ఆలోచించాలి.

తప్పదు మరీ.కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ ఆరవ సీజన్ చూస్తూ ఉంటే క్రియేటివిటీ కరువైపోయింది.

అంతకుమించి గత సీజన్ లో లవ్ ట్రాక్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇక ఇప్పుడు అలాంటి లవ్ ట్రాక్ లు కూడా హౌస్ లో ఎక్కడ కనిపించడం లేదు.

దాంతో మరింత బోర్ గా తయారయ్యింది షో.ఇక ఎవరు లవ్ ట్రాక్ నడిపించకపోతే బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చి మరి లవ్ చేసుకొమ్మని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

"""/"/ దీంతో బిగ్ బాస్ చూడాలనిపించినా కూడా అందులో కొత్తగా ఏముంటుందిలే అని కొంతమంది ప్రేక్షకులు చూడడమే మానేస్తున్నారట.

అంతే కాదు బిగ్ బాస్ ఆరో సీజన్ లో కేవలం కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం చేసే కుతంత్రాలు తప్ప అసలైన ఎంటరైన్మెంట్ మాత్రం ఎక్కడ దొరకడం లేదన్నది ప్రస్తుతం ప్రేక్షకులు చెబుతున్న మాటలు.

ఇలా ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్లు.బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులు అన్నీ కూడా ఇప్పటికే ఇది ఎక్కడో చూసేసామే అని ప్రేక్షకులకు అనిపిస్తుంది.

ఇప్పటికైనా బిగ్ బాస్ నిర్వాహకులు పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచన పక్కన పెట్టి సరి కొత్తగా ఆలోచిస్తారో లేదో చూడాలి.

లేదంటే ఇప్పటివరకు బిగ్ బాస్ బాగా కలిసి వచ్చిన లవ్ ట్రాక్ లను ఎడిటింగ్ ద్వారా సృష్టించి ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

న‌ల‌భైల్లో పిల్ల‌ల‌ను ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!