అవినాష్, రోహిణి హిలేరియస్ కామెడీ.. బిగ్‌బాస్ హౌజుకు కొత్త జోష్…

బిగ్‌బాస్ హౌజుకు కొత్త జోష్ వచ్చింది.నిన్న దసరా స్పెషల్ బిగ్‌బాస్ వీకెండ్ పేరిట సాయంత్రం ఏడు గంటలకే షో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఎపిసోడ్‌లో నాగార్జున ( Nagarjuna )కూడా చాలా హుషారుగా హోస్టింగ్ చేశాడు.

పూలచొక్కా, లుంగీ, ధోతి కట్టుకుని ఈ సోగ్గాడు గ్రూపు డాన్సర్లతో మంటలు పుట్టించాడు.

ప్రేక్షకులకు తగినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి నిర్వాహకులు బాగానే ఖర్చు చేసినట్టున్నారు.డింపుల్, ఫరియాల డాన్సులు, స్టెప్పులు బాగానే అలరించాయి.

కొన్ని పాటలు, గ్రూపు డాన్సులు సైతం ఆకట్టుకున్నాయి.ఎపిసోడ్ మధ్యలో గోపీచంద్, శ్రీను వైట్ల వచ్చి తమ "విశ్వం" సినిమా( Vishvam ) ప్రమోట్ చేసుకున్నారు.

ట్రైలర్ కూడా ప్లే చేశారు.వీళ్లు వెళ్లిపోయాక ఫోక్ సింగర్ మంగ్లీ వచ్చి నాలుగు పాటలు పాడి హుషారెత్తించింది.

బ్యాక్ గ్రౌండ్‌లో మళ్లీ గ్రూప్ డాన్సర్లు సందడి చేశారు.అయితే ఈ గ్రూప్ డాన్సర్లు ఎక్కువ సార్లు కనిపించడం వల్ల ఇది ఇన్ బిగ్ బాస్ షోనా? లేదంటే ఢీ షోనా? అనే సందేహం కలిగింది.

కానీ బిగ్‌బాస్ ప్రేక్షకులను దసరా పండగ సందర్భంగా అలరించడానికి ప్రయత్నించాడు.అందులో సందేహం లేదు.

"""/" / కానీ కొన్ని గేమ్స్ చిరాకు ఎత్తించాయి.ఆడాళ్లను మగాళ్లు తమ చేతులతో మోసుకెళ్లి లెటర్స్ తీసుకురావడం, రిస్ట్ పవర్ చూపించడం వంటి గేమ్స్ కొంచెం బోరింగ్ గా అనిపించాయి.

ఇలాంటి సమయంలో అవినాష్, రోహిణి ( Avinash, Rohini )వచ్చి హిలేరియస్ కామెడీ చేసి చాలా రిలీఫ్ అందించారు.

వీళ్లతో షోలో ఎంటర్‌టెయిన్‌మెంట్ పెరిగిపోయిందని అనడంలో సందేహం లేదు.అవినాష్ మాత్రమే కాదు రోహిణి కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

హరితేజ కూడా పర్లేదు.మెహబూబ్( Mehboob ) చాలా డల్ అని చెప్పుకోవచ్చు.

గేముల్లో బాగానే ఆడతాడు కానీ మిగతా సమయంలో అంత వినోదాన్ని పంచలేడు.నబీల్ కూడా చాలా వీక్ కంటెస్టెంట్.

ఈసారి విన్నర్ నిఖిల్ అవుతాడని చాలామంది అనుకున్నారు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాకతో బాగా వెనుకబడిపోయాడు.

రీసెంట్ హోటల్ టాస్కులో యష్మి ఇరగదీసింది కానీ దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఆమె కొంచెం కూడా యాక్టివ్ గా లేదు.

"""/" / ఇక గంగవ్వ బతుకమ్మను చక్కగా పేర్చి వావ్ అనిపించింది.ఈసారి కంటెస్టెంట్లలో కొందరు కన్నడ, కొందరు ఆంధ్రా వాళ్ళు ఉన్నారు కాబట్టి బతుకమ్మ పేర్చలేకపోయారు.

అదంతా వదిలేస్తే ఎపిసోడ్ మాత్రం బాగానే పండింది.విష్ణుప్రియ పాటలు - వస్తువుల పోటీలో చాలా బాగా ఆడింది.

కానీ బిగ్ బాస్ ఎందుకో ఆమెను కావాలనే ఓడించి మెహబూబ్ టీమ్‌ను గెలిపించాడు.

బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే 50 రోజులు అవుతుంది అయితే ఇప్పటిదాకా టిఆర్పి రేటింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా పెద్దగా నమోదు కాలేదు.

దసరా ఎపిసోడ్‌కి ఎక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

చూడాలి మరి ఏమవుతుందో!.

రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే రక్తహీనత నుంచి బలహీనత వరకు అన్ని సమస్యలు పరార్!