Bigg Boss 7: వారానికే ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారా ? విచక్షణ కోల్పోతున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు

ఎవరైనా ఒక్కరే ఇంట్లో ఎవరితో సంబంధం లేకుండా ఉన్నట్టయితే ఒక గంట, రెండు గంటలు బానే ఉంటుంది.

ఒక రోజు కూడా మేనేజ్ చేయొచ్చు.కానీ అలా వారాల కొద్ది వెళ్లే కొద్ది వారిలో ఒంటరితనం ఆవహిస్తుంది.

పైగా ఒక తెలియని డిప్రెషన్ కి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది.కొంతమందిలో సూసైడ్ టెండెన్సి కూడా కనిపిస్తుంది.

కానీ బిగ్ బాస్ హౌస్ లో( Bigg Boss House ) అలా కాదు.

తమ చుట్టూ 14, 15 మంది కంటెస్టెంట్స్ ఉంటారు.ప్రతినిత్యం తినడానికి, ముందుకు వెళ్లడానికి పోరాటం చేయాలి.

తమతో ఉన్నవారితోనే ప్రతిరోజు యుద్ధం చేసినట్టుగా ఉంటుంది.నాలుగు గోడల మధ్య బంధించి ఆట ఆడండి, గెలవండి డబ్బులు, సంపాదించండి అనే ప్రెజర్ వారిపై పెట్టడం జరుగుతుంది.

"""/" / అందువల్ల వారికే తెలియని ఒక డిప్రెషన్ కి ( Depression ) కూడా లోనై స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ పరిణామాల కారణంగా విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు అరచుకోవడం కూడా జరుగుతుంది ప్రస్తుతం బిగ్ బాస్ సెవెన్ సీజన్( Bigg Boss 7 ) తెలుగులో కూడా ఇదే జరుగుతుంది ఆట మొదలై పది రోజులు కూడా గడవలేదు రెండో వారం నాగార్జున( Nagarjuna ) రావాల్సి ఉండగా ఇలా ఒకరి కోసం ఒకరు ఏదో ఒక చిన్న విషయానికి విచక్షణ కోల్పోయి అరవడాలు, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కాని భాషలో తిట్టుకోవడం, ఒక రకమైన పిచ్చి అరుపులు అరుస్తున్నారు.

ప్రస్తుతం బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు అరే రెండు వారాలు గడవకముందే ఇంటి సభ్యులు అంతా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే ప్రశ్న అందరి లో మొదలవుతోంది.

"""/" / ఒకరోజు శివాజీ( Shivaji ) మరొక రోజు రతిక( Rathika ) నిన్నటికి ప్రిన్స్( Prince ) అలాగే గౌతమ్.

( Gautam ) ఇలా ప్రతి ఒక్కరు ఏదో రకంగా విచక్షణ కోల్పోయి అరుచుకుంటూ ఉండటం చూస్తున్న ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది.

మరి నిజంగానే ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారా ? సీజన్ టిఆర్పి పెరగడానికి బిగ్బాస్ యాజమాన్యం వారిని అలా ఉసిగొలుపుతుందా? ఇది ఇలాగే జరిగితే మరి రానున్న వారాల పరిస్థితి ఏంటి? అసలు ఈ సీజన్ ముగిసే లోపు ఎవరికైనా పిచ్చి పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..?