రేవంత్ ని ఒక ఆట ఆడుకున్న హోస్ట్ నాగార్జున.. అది కూడా గుర్తు లేదా అంటూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.అయితే మొదట్లో బిగ్ బాస్ షో కాస్త డల్ గానే అనిపించినప్పటికీ రాను రాను ఇంట్రెస్టింగ్ గా తయారయ్యింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆదివారం దీపావళి సంబరాలతో బిగ్ బాస్ వేదిక ఫుల్ కలర్ ఫుల్ గా మారింది.

దీపావళి పండుగ ముందు రోజే బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సంబరాలు స్టార్ట్ చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే హోస్ట్ నాగార్జున ఒక కొత్త రకం గేమ్ ఆడించాడు.

అప్పుడు ఇద్దరు కంటెంట్ ను సేవ్ చేయగా అందులో సేవ్ అయిన రేవంత్ ని నాగార్జున ఒక ఆట ఆడుకున్నాడు.

నామినేషన్ లో ఉన్న వారందరూ ఓ టైమ్ రికార్డర్ బటన్ నొక్కగా అందులో సేవ్ అయిన వారు ముందు వాయిస్ వినిపిస్తుంది చెప్పారు నాగార్జున.

అప్పుడు రేవంత్ వచ్చి ఆ బటన్ నొక్కు తన భార్య వాయిస్ వినిపిస్తుంది.

అప్పుడు రేవంత్ సేవ్ అయినట్లు వాయిస్ వినిపించడంతో ఆ సంతోషంలో ఆ వాయిస్ ఎవరిది అన్నది కూడా గుర్తుపట్టలేకపోయాడు రేవంత్.

ఇంతలోనే హౌస్ లో ఒకరు ఆ వాయిస్ ఎవరిదో గుర్తులేదా అని అడగగా.

ఆ వాయిస్ మీ వైఫ్ ది కదా అనడంతో వెంటనే బల్బు వెలిగిన రేవంత్ అవునా అంటూ తన భార్య వాయిస్ వినిపించినందుకు థాంక్స్ అని చెప్పాడు.

"""/"/ అప్పుడు నాగార్జున ఏంటి రేవంత్ అప్పుడే నీ భార్య వాయిస్ కూడా మర్చిపోయావా.

హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆరు వారాల్లోనే భార్యను మర్చిపోతే ఎలా రేవంత్ అంటూ ఒక ఆట ఆడుకున్నాడు.

అంతేకాకుండా బిగ్బాస్ ఫస్ట్ రోజు మీ వైఫ్ కళ్ళు చూపిస్తే గుర్తుపట్టలేకపోయావ్ అంటూ దాన్ని కూడా గుర్తు చేస్తూ రేవంత్ పై సెటైర్లు వేస్తూ ఉండగా వెంటనే రేవంత్ సార్ మళ్లీ నా భార్య ముందు బుక్ చేయకండి సార్ అంటూ బ్రతిమలాడుకున్నాడు.

దాంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా నవ్వుతున్నారు.

పుష్ప ది రూల్ బీహార్ ఈవెంట్ పై విమర్శలు చేసిన సిద్దార్థ్.. ఏకంగా ఇంత జరిగిందా?