అయ్యో పాపం కీర్తీ భట్.. హౌస్ మేట్స్ అంతా కలిసి జైల్లోకి దొబ్బేసారుగా!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు, తిట్టుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి.

అంతే కాకుండా హౌస్ లో కొందరు కంటెస్టెంట్ లు గ్రూపులుగా గేమ్ ఆడుతూ మరి కొంతమందిని సింగిల్ గా చేసి ఆట ఆడుతున్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తాజా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్క్ విషయంలో కూడా అదే జరిగింది.

తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కార్తీకదీపం సీరియల్ కీర్తిని ఒంటరిని చేసి అందరూ ఆడుకున్నారు.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు ఎవరు ఎక్కువ సేపు టీవీలో కనిపిస్తున్నారు అన్నది రేటింగ్ చెప్పాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగానే గొడవకు దిగారు గీతూ, రేవంత్.అప్పుడు గీతూ అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాను కాబట్టి 10 నిమిషాలు తనను చూపిస్తారని గీతూ తెలిపింది.

అప్పుడు రేవంత్ కూడా ఎక్కువ నామినేషన్స్ లో తానే ఉన్నాను అలాగే ఎక్కువ యాక్టివ్ గా కూడా ఉన్నాను కాబట్టి నన్ను ఎక్కువగా చూపించే అవకాశం ఉంది అని అంటాడు.

"""/"/ అప్పుడు 0.3 కంటే తక్కువగా ఉన్న వారికి జీరో రేటింగ్ ఇవ్వాలి అని చెప్పగా అప్పుడు ఆరోహి, కళ్యాణ్, కీర్తికి జీరో రేటింగ్ ఇచ్చారు.

ఇక వారి ముగ్గురిలో ఒకరిని జైల్లో ఉంచాలి అని చెప్పడంతో అందరూ ఏక నిర్ణయం తీసుకొని కీర్తిని జైల్లో పెట్టడానికి అంగీకరించారు.

దీంతో చేసేదేమీ లేక కీర్తి జైల్లోకి వెళ్ళింది.జైల్లోకి వెళ్లిన కీర్తి ఎమోషనల్ అయింది.

ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టార్ హీరోయిన్ దెబ్బకు స్టార్ హీరో మూవీ అట్టర్ ఫ్లాప్.. నిండా ముంచేసిందిగా!