పెళ్లి కాకుండానే తల్లైన బిగ్ బాస్ సిరి హన్మంత్.. అసలేమైందంటే?

ప్రేక్షకులకు పెద్దగా సుపరిచితమైన కంటెస్టెంట్ కాకపోయినా బిగ్ బాస్ షో ద్వారా సిరి హన్మంత్ పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్5 లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సిరి హన్మంత్ టాప్5లో ఉంటారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పలువురు సినీ ప్రముఖులు సైతం సిరి హన్మంత్ కు మద్దతు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం.

టాస్కులలో సైతం యాక్టివ్ గా ఉంటూ సిరి హన్మంత్ క్రేజ్ ను పెంచుకున్నారు.

యూట్యూబ్ లో సిరి హన్మంత్ చేసిన వెబ్ సిరీస్ లు రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.

వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీ రావడంతో ఎలిమినేషన్ లోకి వచ్చినా సిరి సులభంగానే సేఫ్ అవుతున్నారు.

ప్రముఖ నటుడు శ్రీహాన్ తో సిరి హన్మంత్ కు కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది.

అయితే సిరి హన్మంత్ పెళ్లి కాకముందే తల్లి అయ్యారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా సిరి హన్మంత్ ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ అయిన చైతూను దత్తత తీసుకున్నారా? అనే ప్రశ్నను నెటిజన్ అడగగా సిరి ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అవుననే సమాధానం వచ్చింది.

"""/"/ సిరి బాలనటుడిని దత్తత తీసుకోవడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.సిరి గొప్పమనస్సును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

బిగ్ బాస్ ఆఫర్ రావడంతో సిరి శ్రీహాన్ ల పెళ్లికి బ్రేక్ పడగా బిగ్ బాస్ హౌస్ నుంచి సిరి బయటకు వచ్చిన తర్వాత వీళ్ల పెళ్లి జరగనుంది.

"""/"/ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న సిరి బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలిచి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారేమో చూడాల్సి ఉంది.

బాలనటుడికి మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా సిరి హన్మంతు అడుగులు వేయడం గమనార్హం.

బీవీఎస్ రవి డైరెక్షన్ లో రవితేజ సినిమా చేయబోతున్నాడా..?