బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ ఇన్నాళ్లు అజ్ఞాతంకు కారణం ఇదే!

తెలుగు సినీ నటుడు అభిజిత్ గురించి అందరికి తెలిసిందే.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఇక ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా ఒక్క అవకాశం కూడా అందుకోలేదు.

ఇక పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అభిజిత్ కు మరోసారి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో తనేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తన క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక తను ఆడిన ఆటల గురించి, తోటి కంటెస్టెంట్ లతో ఉండే విధానం గురించి ప్రేక్షకులు ఆయనకు ఫుల్ కు ఫుల్ మార్కులు వేసి సీజన్ 4 కి టైటిల్ విన్నర్ గా గెలిపించారు.

ఇక బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరీర్ మొత్తం మలుపు తిరుగుతుందని అందరూ అనుకున్నారు.

"""/"/ కానీ ఈయనతో పాటు మరి కొందరు కంటెస్టెంట్ లు తప్ప మిగిలిన వారంతా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.

వరుస ప్రాజెక్టులలో అవకాశము అందుకొని బిజీగా ఉంటున్నారు.కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి అవకాశాలు అందుకోలేడు అభిజిత్.

గతంలో మాత్రం తాను మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు.త్వరలోనే షూటింగ్ లలో కూడా అడుగు పెడుతున్నట్లు ప్రకటించాడు.

కానీ ఏం జరిగిందో ఏమో మళ్ళీ ఆ సినిమాల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.

గతంలో ఈయన అభిమానులు తన సినిమా గురించి ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నలు కూడా వేయడంతో.

తన ఆరోగ్యం బాలేదని త్వరలోనే తన సినిమాల గురించి ప్రకటిస్తానని తెలిపాడు. """/"/ నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత అభిజిత్ గురించి ఎవరికీ అంత తెలియదు.

కానీ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక మాత్రం ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

అంతేకాకుండా ఆయన సినిమాల కోసం ఎంతో ఆతృత చూపడంతో అభిజిత్ మాత్రం మొన్నటి వరకు ఎటువంటి అప్డేట్లని ఇవ్వలేదు.

కానీ తాజాగా ఈయన మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇక ఇది అమెజాన్ ప్రైమ్ లో జులై 8న విడుదల కానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉండగా తాజాగా తను ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న అన్ని బయట పెట్టాడు.

నిజానికి ఆయన హెల్త్ బాగోలేనందుకే ఏ ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు అని తెలిపాడు. """/"/ ఆ సమయంలో తనకు ఎన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా తన ఆరోగ్యం బాలేదు అని ఒప్పుకోలేదట.

మొత్తం తన ఆరోగ్యం పై పూర్తి దృష్టి పెట్టుకున్నాడట.ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారింది.

మొత్తానికి ఇంత కాలానికి అభిజిత్ ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరి ఈ సిరీస్ తో అభిజిత్ ఎటువంటి సక్సెస్ అందుకొంటాడో చూడాలి.

వీడియో: పట్టపగలే దారుణ హత్య.. గోల్డ్‌ చైన్ ఇవ్వలేదని!