బిగ్ బాస్ ను ఎవరూ చూడట్లేదా.. దారుణంగా పడిపోయిన రేటింగ్స్?

బుల్లితెర రియాలిటీ షోలలో బడ్జెట్ పరంగా చూస్తే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.

స్టార్ హీరోలు హోస్ట్ చేయడం, సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొనడం, ప్రత్యేకమైన సెట్, వందల్లో సిబ్బంది పని చేస్తూ ఉండటం వల్ల బిగ్ బాస్ షోకు భారీగానే ఖర్చవుతోంది.

అయితే ఆ ఖర్చుకు తగిన విధంగా రేటింగ్స్ వస్తున్నాయా.? బిగ్ బాస్ సీజన్ 4 హిట్టేనా.

? అనే ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు సమాధానాలుగా వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

అయితే తొలి వారం వీక్ డేస్ రేటింగ్ మాత్రం 8కు అటూఇటుగా ఉంది.

రెండో వారానికి ఆ రేటింగ్ మరింత తగ్గగా హైదరాబాద్ బార్క్ లెక్కల ప్రకారం మూడో వారం వీక్ డేస్ టీఆర్పీ రేటింగ్ 5 కంటే తక్కువ.

అదే స్టార్ మా ఛానెల్ లో రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే వంటలక్క కార్తీకదీపం సీరియల్ కు మాత్రం టీఆర్పీ రేటింగ్ 16, 17 కు పైగా ఉంటోంది.

ఐపీఎల్ సీజన్ లో సైతం టీఆర్పీ రేటింగ్స్ లో వంటలక్క హవా నడుస్తోంది.

నాగార్జున హోస్ట్ చేసిన వీకెండ్స్ షోల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

శనివారం టీఆర్పీ 5.57 కాగా ఆదివారం రేటింగ్ 8.

07.ఈ రేటింగ్ లను చూస్తే బిగ్ బాస్ షోను ఎవరూ చూడట్లేదా.

? అనే అనుమానాలు కలుగుతున్నాయి.చాలా సంవత్సరాల క్రితం విడుదలైన మన స్టార్ హీరోల సినిమాలను టెలీకాస్ట్ చేసినా కూడా ఇంతకంటే బెటర్ రేటింగ్స్ వస్తాయి.

బిగ్ బాస్ షోపై ఐపీఎల్ ప్రభావం కూడా బాగానే పడినట్టు అర్థమవుతోంది.వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక బాగానే ఉన్నప్పటికీ సీజన్ కు పెద్దగా మార్పులు లేకపోవడంతో ప్రేక్షకులకు షోపై ఆసక్తి తగ్గుతోంది.

షోలో పాల్గొన్న సెలబ్రిటీలు కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారే కావడం షోకు మైనస్ గా మారింది.

మూడో వారంలోనే బిగ్ బాస్ కు ఇంత దారుణమైన రేటింగ్స్ వస్తే రాబోయే వారాల్లో షో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

రేటింగ్స్ తగ్గడంతో బిగ్ బాస్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కుక్క ముందే కుక్కలాగా అరిచిన ప్రముఖ యూట్యూబర్‌.. నెక్స్ట్ ఏమైందంటే..?