ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ను రీవీల్ చేసిన బిగ్ బాస్.. ఎవరో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.

ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 8వ సీజన్ 4 వారాలు పూర్తిచేసుకుని నలుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇక ఈవారం వైల్డ్ కార్డు ( Wild Card ) ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.

"""/" / ఇకపోతే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది.

ఇక వైల్డ్ కార్డు ద్వారా 8 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.

అయితే ఈ ఎనిమిది మంది కూడా గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న వారేనని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఫస్ట్ కంటెస్టెంట్ అంటూ ఒక కంటెస్టెంట్ ఫోటోని షేర్ చేశారు.

"""/" / ఈ కంటెస్టెంట్ ఫోటోని షేర్ చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ షాక్ ఇచ్చారు.

ఫేస్ కనపడకుండా కేవలం షాడో మాత్రమే రివీల్ చేస్తూ ఈ కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ పోస్ట్ చేశారు.

అయితే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోతోంది టేస్టీ తేజ ( Tasty Teja ) అని స్పష్టంగా తెలుస్తోంది.

టేస్టీ తేజ తో పాటు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి నయనీపావని, గౌతమ్ కృష్ణ, హరితేజ, ముక్కు అవినాష్, గంగవ్వ, మెహబూబ్ దిల్ సే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం.

అయితే టేస్టీ తేజ పక్కగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్… నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్!