శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
TeluguStop.com
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్( Priyanka Jain ) ఎట్టకేలకు తన ప్రియుడు శివకుమార్( Shiva Kumar ) తో కలిసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు.
మేము స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని అలాగే తిరుమల( Tirumala ) ఆలయ పవిత్రతను నాశనం చేయాలన్న ఉద్దేశంతో మేము అక్కడ రీల్స్ చేయలేదు ఏదో సరదాగా మేము రీల్స్ చేసాము అయితే ఈ రీల్స్ కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉన్నట్లయితే వారందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాము అంటూ క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు.
"""/" /
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో మేము ఈ వీడియో తీయలేదని, ఇలా మేము తెలియక చేసిన ఈ తప్పుని ప్రతి ఒక్కరు క్షమించాలని కోరారు.
అసలు ఈమె క్షమాపణలు చెప్పడానికి కారణం ఏంటి అనే విషయానికొస్తే తిరుమల అలిపిరి మెట్ల మార్గంకుండా వీరు కొండపైకి వెళ్తూ ఫ్రాంక్ వీడియోలు( Prank Videos ) చేసి భక్తులను తీవ్రమైన భయభ్రాంతులకు గురిచేశారు.
దీంతో వీరి వ్యవహార శైలి పై కేసు నమోదు చేయాలి అంటూ నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"""/" /
అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు.
చిరుత అరుపును రీల్స్‌లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు.తీరా చూస్తే అక్కడ చిరుత కనిపించలేదని అంతా తూచ్ అంటూ ఫ్రాంక్ చేశారు.
అయితే ఇదే ప్రాంతంలో గతంలో ఓ పులి అమ్మాయి పై దాడి చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేసింది.
ఇలాంటి సమయంలో వీరు పులి వచ్చింది అంటూ తమ వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేయడం పట్ల నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ టీటీడి అధికారులను డిమాండ్ చేయడంతో చివరికి వీరిద్దరూ క్షమాపణలు తెలియజేశారు.
రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు