ఓటీటీ- బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనా?
TeluguStop.com

ఇంతకాలం బుల్లితెరపై సందడి చేసిన బిగ్ బాస్ తాజాగా.ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతుంది.


దీనికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరు కూడా పెట్టారు.ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ దిగ్గజ డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 26 నుంచి ప్రసారం అవుతుంది.


ఈ షోకు కూడా అక్కినేని నాగార్జున హోస్టుగా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.
ఈ ప్రోమో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.మళ్లీ బిగ్ బాస్ ఎంజాయ్ మెంట్ అందుకోవచ్చని సంతోష పడుతున్నారు.
"""/" /
మరో 10 రోజుల్లో ఈ షో మొదలు కానుంది.అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి పేర్లు బయటకు రాలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరే అంటూ ఓ లిస్టు హల్ చల్ చేస్తుంది.
ఇందులో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 5 వరకు హౌస్ మేట్స్ గా ఉన్న వారినే ఇందుకు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఒక్కో సీజన్ కు ఇద్దరు చొప్పున 10 మందిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.మరో 8 మందిని కొత్తవారిని తీసుకున్నట్లు టాక్.
ఓటీటీ బిగ్ బాస్ లోకి వెళ్లేవారు ఎవరు? అనే లిస్టు ఒకసారి చూద్దాం.
ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలి అంటే షో టెలీకాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.
ఇంతకీ ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే. """/" /
* ముమైత్ ఖాన్(సీజన్-1)
* ధనరాజ్(సీజన్-1)
* ఆదర్శ్( సీజన్-1)
* తనీష్(సీజన్-2)
* అషు రెడ్డి( సీజన్-3)
*మహేష్ విట్టా(సీజన్-3)
* అరియానా(సీజన్-4)
*అఖిల్ సార్థక్(సీజన్-4)
* సరయూ( సీజన్-5)
* హమీదా( సీజన్-5)
*నటరాజ్ మాస్టర్ (సీజన్-5)
కొత్త గా హౌస్ లోకి వస్తున్న కంటెస్టెంట్లు.
* య్యూట్యూబర్ నిఖిల్
* యాంకర్ శివ
* యాంకర్ స్రవంతి
* ఆర్జే చైతు
* మోడల్ అనిల్ రాథోడ్
*బమ్ చిక్ బబ్లూ
* మోడల్ మిత్రా శర్మ.
ఇది విన్నారా? మల్టీఫ్లెక్స్‌లలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్