అదయ్యాక హ్యాండ్ ఇచ్చాడు.. అషు రెడ్డి లవ్ స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అషురెడ్డి.

సోషల్ మీడియాలో అషురెడ్డికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అషురెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆమెకి ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే గతంలో బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిన అషురెడ్డి ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఓటీటీ ఈ సీజన్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు తలుపు తట్టిన ప్రేమ అనే టాస్క్ ను ఇచ్చాడు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ వారి మొదటి లవ్ గురించి చెప్పాలి అని తెలిపాడు బిగ్ బాస్.

టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వారి మొదటి ప్రేమ అనుభవం గురించి వెల్లడించారు.

ఈక్రమంలోనే అషురెడ్డి తన ప్రేమ కథ గురించి వివరిస్తూ.నాకు అప్పుడు 20 ఏళ్ళు.

ఆ సమయంలో నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను.అతడు నేను కనిపించగానే నుదుటిపై ముద్దు పెట్టే వాడు అలా చిలిపి చిలిపి పనులు చేసేవాడు.

అలా మా ప్రేమకథ క్యూట్ గా నడిచింది. """/"/ ఆ తరువాత మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం కలుసుకోవడం ఎలా చాలా ఎంజాయ్ చేసాం.

అయితే ఈ విషయాలన్నీ కూడా నేను మా ఫ్రెండ్స్ కు చెప్పేదాన్ని అని తెలిపింది అషురెడ్డి.

ఆ తరువాత మా ప్రేమ గురించి ఇంట్లో తెలియడంతో నన్ను చాలా రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత మా వాళ్ళు నన్ను ముందుగా వెళ్లి యూఎస్ఏకి ఎంబీఏ పూర్తి చేసుకొని రమ్మని చెప్పారు.

ఆ విషయం అతనికి చెప్పగానే అతను కూడా వస్తాను అని చెప్పాడు.కానీ తీరా ఫ్లైట్ ఎక్కించి అతను మాత్రం అక్కడే ఉండిపోయాడు అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఎంబీఏ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్న కూడా అతనిలో మార్పు కనిపించడంతో అతడికి బ్రేకప్ చెప్పేసాను.

తర్వాత ఆ బాధ నుంచి బయట పడ్డానికి చాలా రోజులు సమయం పట్టింది.

అలా అతడి చేతిలో నేను దారుణంగా మోసపోయాను అని చెప్పుకొచ్చింది అషురెడ్డి.

వైరల్ వీడియో: దేవుడా.. అతడు మనిషా..? రాక్షసుడా..?