ఈ వారం ఎలిమినేట్ అయ్యింది అతడే.. స్పెషల్ గెస్ట్ గా బాబా భాస్కర్!

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతోంది.

17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.

ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.అయితే బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షోను ఓటీటీ లోకి తీసుకువచ్చి హౌస్ లో కంటెస్టెంట్ లు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి 24గంటలు చూసే విధంగా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ హిందీ,తమిళ భాషల్లో వర్కవుట్ అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌,శ్రీరాపాక, చైతూ,స్రవంతి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఏడవ వారం నామినేషన్ సమయం కూడా దగ్గరపడింది.ఇక ఈ వారం నామినేషన్ లో అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా లు వున్నారు.

ఇక వీరిలో అఖిల్,బిందుమాధవి మధ్య గట్టిగానే పోటీ జరుగుతోంది.అంతేకాకుండా వీరిద్దరూ ఓట్ల రేసులో దూసుకుపోతున్నారు.

ఇక అరియానా,శివ కూడా మొదటి నుంచి గేమ్ బాగా ఆడుతూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ప్రతీ వారం లాగే ఈ వారం కూడా మిత్రశర్మ సేఫ్.మిగిలింది కేవలం ఇద్దరే ఒకరు అనిల్ కాగా మరొకరు మహేష్ విట్టా.

"""/" / వీరిద్దరు కూడా ఎవరి నచ్చిన విధంగా వారు గేమ్ ఆడుతూ ఉన్నారు.

మరీ ముఖ్యం గా చెప్పాలి అంటే అనిల్ ఇంట్లో ఉండి లేనట్టుగా ఉంటున్నాడు.

ఇక మొదటినుంచీ మహేష్ విట్టా ఆట తీరు చూస్తుంటే ఈసారి తప్పకుండా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకడిగా నిలుస్తాడు అని నమ్మకం కలుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ విట్టా ను తాజాగా హౌస్ నుండి ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / ఏడవ వారం నామినేషన్ లో భాగంగా మహేష్ ను ఎలిమినేట్ చేసినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

ఓట్ల పరంగా మహేష్ విట్టా మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ అతను ఊహించని విధంగా ఏడవ వారం ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి మహేష్ విట్టా ను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే బిగ్‌బాస్‌ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అదేమిటంటే మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది.

మరి బిగ్‌బాస్‌ ప్లాన్‌ ఏమేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి మరి.

భారత్, కొరియా ఇళ్ల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటే..?