ఫ్యామిలీతో కలిసి నాగార్జునను పెళ్లికి ఆహ్వానించిన మానస్.. ఫోటోలు వైరల్!

బుల్లితెర నటుడిగా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నటువంటి వారిలో నటుడు మానస్ ( Manas ) ఒకరు.

ఈయన పలు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.

అదేవిధంగా బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మానస్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా హౌస్ లో ఉన్నటువంటి అమర్ దీప్(Amardeep) కోసం బిగ్ బాస్ వేదిక పైకి వెళ్లారు.

"""/" / ఇలా అమర్ తల్లితో కలిసి బిగ్ బాస్ వేదిక పైకి వెళ్లినటువంటి ఈయన హౌస్ లో ఉన్నటువంటి తన స్నేహితుడు అమర్ కి కొన్ని సూచనలు చేశారు.

అయితే త్వరలోనే మానస్ పెళ్లి(Manas Wedding) చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈయన నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఈయన ఇప్పటికే పెళ్లి పనులలో బిజీ అయ్యారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి మానస్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లారు.

"""/" / మానస్ పెళ్లి త్వరలోనే జరుగుతున్న నేపథ్యంలో నాగార్జున (Nagarjuna) గారికి పెళ్లి పత్రికను (Wedding Invitation) అందించి తమ పెళ్ళికి రావాలని కోరారు.

ఇదే విషయాన్ని మానస్ తల్లి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాగార్జున గారిని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన నా కుమారుడిని బ్లెస్ చేశారు అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మానస్ పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : తమిళనాడులోని ఆ గ్రామంలో పండుగ వాతావరణం