బిగ్ బాస్ హిమజ గొప్పదనం ఇదే.. డ్రైవర్ ముగ్గురు పిల్లలను అమే చదివిస్తూ?

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన హిమజ( Himaja ) తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాల ద్వారా అంచనాలకు మించి పాపులర్ అయ్యారు.

హిమజ పూర్తి పేరు హిమజ మల్లిరెడ్డి( Himaja Mallireddy) కాగా రామ్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఆమె ఎక్కువగా నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో హిమజ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ బారియర్స్ లేవని మగవాళ్లు మనం సేమ్ అని ఆమె తెలిపారు.

సొసైటీ వల్ల నేను కూడా ఏడ్చానని ఘోరంగా బాధ పడ్డానని హిమజ పేర్కొన్నారు.

మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనకు తెలిసినట్లయితే ఎవ్వరు చెప్పినా ఆగేది లేదని ఆమె చెప్పుకొచ్చారు.

మనం ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్లిపోవడమే అని హిమజ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

"""/" / యూజ్ లెస్ మాటలు బయటకు వెళ్లిపోవాలని మనస్సులోకి వెళ్లిపోకూడదని అమె కామెంట్లు చేశారు.

ప్రస్తుతం బయటి వాళ్ల గురించి ఆలోచించడం కంటే మా ఇంట్లో మా డ్రైవర్ పిల్లలను చదివించాల్సిన బాధ్యత తనపై ఉందని డ్రైవర్ కు ముగ్గురు పిల్లలు అని నా సర్కిల్ ను మొదట ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను భావిస్తున్నానని హిమజ చెప్పుకొచ్చారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నట్టు హిమజ పరోక్షంగా కామెంట్లు చేశారు.నేను ఏదైనా బ్రాండ్స్ ప్రమోట్ చేసిన సమయంలో కంపెనీల నుంచి పాజిటివ్ కామెంట్లు వస్తాయని ఆమె తెలిపారు.

నెగిటివ్ కామెంట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని హిమజ అన్నారు.నా కళ్లు చిన్నగా ఉన్నాయని చాలామంది అన్నారని మేకప్ వేశాక ఆ ఒపీనియన్ మారిపోయిందని ఆమె పేర్కొన్నారు.

నా వాకింగ్ గురించి కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని హిమజ అన్నారు.హిమజ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ