బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మకు అలాంటి మెసేజ్ లు.. అతని అమ్మను ఇలా అంటే పరవాలేదా అంటూ?
TeluguStop.com
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ షో( Bigg Boss ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈ షో తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం అని భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల భాషల్లో సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది.
ఇప్పటికీ కొన్ని భాషల్లో పదుల సంఖ్యలో సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో.
ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.అటువంటి వారిలో శ్వేతా వర్మ( Swetha Varma ) కూడా ఒకరు.
తెలుగులో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ కనిపించింది.
కానీ నటిగా కాకుండా బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఈ షోలో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
బిగ్ బాస్ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది.అయితే గత కొద్ది కాలంగా ఈ బ్యూటీ అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటోంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్వేత. """/" /
ఈ క్రమంలోనే ఇటీవల ఆమె చేసిన ఒక పోస్టుకు ఒక వ్యక్తి అసభ్యకరమైన మెసేజులు( Abusive Messages ) చేశాడు.
దీంతో చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది శ్వేత.అసభ్యంగా కామెంట్ చేసిన సదరు వ్యక్తి ప్రోఫైల్ ఐడీ కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని స్క్రీన్ షాట్స్ చేసింది శ్వేత.
అందులో ఓ వ్యక్తి శ్వేత ఫోటోకు( Swetha Photo ) అసభ్యకరంగా కామెంట్ చేశాడు.
దీంతో శ్వేత రియాక్ట్ అవుతూ.ఒక మనిషికి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది ? """/" /
అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలాగే చెబితే పర్వాలేదు అనుకుంటాడా ? అంటూ రాసుకొచ్చింది.
అలాగే అతడి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది.ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తుందని.
అలాగే తనకున్న సోర్స్ ద్వారా అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించాను అని తెలిపింది.
అతడిది రియల్ అకౌంటా ? ఫేక్ అకౌంటా ? అని ఆలోచన అక్కర్లేదని అది ఏదైనా తెచ్చిపెట్టే సోర్స్ తనకుందని తెలిపింది.
అతడి అడ్రస్ కూడా పోస్ట్ చేయగలని కానీ మనిషిని కాబట్టి చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది శ్వేతా వర్మ.