నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సందీప్ మాస్టర్.. వీడియో వైరల్?
TeluguStop.com
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎన్నో డాన్స్ కార్యక్రమాలు ఎంతో మంది కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆట డాన్స్ కార్యక్రమంలో పాల్గొని విన్నర్ గా నిలిచినటువంటి సందీప్ మాస్టర్ ( Sandeep Master ) ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.అలాగే సోషల్ మీడియాలో కూడా తన భార్య జ్యోతి రాజ్ ( Jyothi Raj ) తో కలిసి డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
"""/"/
ఇకపోతే ఇటీవల ఈ జంట నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అలాగే ఈ కార్యక్రమం తర్వాత సందీప్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ( Bigg Boss 7 ) కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఈయన 8 వారాల వరకు కనీసం నామినేషన్స్( Nominations ) లోకి కూడా రాలేదు.
ఇలా నామినేషన్స్ లోకి రానటువంటి ఈయన ఎనిమిదవ వారం నామినేషన్స్ లోకి రావడం అదే రోజు హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది.
ఇలా బిగ్ బాస్ నుంచి ఊహించని విధంగా బయటకు వచ్చినటువంటి ఈయన 8 వారాలపాటు హౌస్ లో కొనసాగిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈ కార్యక్రమం తర్వాత బయటకు వచ్చినటువంటి సందీప్ మాస్టర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
"""/"/
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా సందీప్ మాస్టర్ దంపతులు తమ నూతన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.
ఉగాది పండుగను పురష్కరించుకొని ఈ గృహప్రవేశ( House Warming ) వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అని తెలియజేశారు.
తమ సొంత ఇంటి కల నెరవేరింది అంటూ ఈ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేశారు.
"""/"/
ఇందులో భాగంగా సందీప్ మాస్టర్ తో పాటు తన భార్య కుమారుడు ముగ్గురు కలిసి ఒకేసారి దేవుడి ఫోటోలను పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత సందీప్ మాస్టర్ ఏకంగా తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారని తెలుస్తుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!