Neha Chowdary : అత్తారింట్లో మొదటసారి బతుకమ్మ వేడుకల్లో బిగ్ బాస్ నేహా… వీడియో వైరల్!

దసరా వచ్చింది అంటే చాలు పెద్ద ఎత్తున తెలంగాణలో బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు.

అలాగే ఆంధ్రాలో కూడా దేవి నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇలా తెలంగాణలో తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ సందడి చేస్తుంటారు అయితే ఈ బతుకమ్మ పండుగ( Bathukamma Festival ) సందర్భంగా సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలలో పాల్గొంటూ ఉంటారు ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంతో మంది సెలెబ్రెటీలు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా బతుకమ్మ వేడుకలకు సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.

"""/" / బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నేహా చౌదరి( Neha Chowdary ) ఒకరు.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఈమె మొదటి 5 వారాలు పాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు.

అయితే బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయ్యేలోగా ఈమె పెళ్లి కూడా చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

తాను ప్రేమించినటువంటి తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జర్మనీలో స్థిరపడ్డారు.

ఈ విధంగా పెళ్లి జరిగినప్పటికీ ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

"""/" / ఇలా యూట్యూబ్ ఛానల్ ( YouTube Channel )ద్వారా అన్ని విషయాలను తెలియచేయడమే కాకుండా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు.

ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బతుకమ్మ వేడుకలకు సంబంధించినటువంటి వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

నా పెళ్లి తర్వాత మొదటిసారి చేసుకుంటున్నటువంటి బ్రతుకమ్మ అంటూ వీడియో చేశారు.ఎప్పుడో చిన్నప్పుడు బతుకమ్మ వేడుకలలో తాను పాల్గొన్నానని అయితే ఒక్కసారి కూడా ఎప్పుడు బ్రతుకమ్మ వేడుకలు చేసుకోలేదని తెలిపారు.

పెళ్లి తర్వాత మొదటిసారిగా అత్తగారింట్లో చాలా పద్ధతిగా సాంప్రదాయంగా బతుకమ్మ వేడుకలు చేసుకుంటున్నాము అంటూ నేహా తెలియజేశారు.

"""/" / ఇక ఈ వీడియోలో భాగంగా నేహా చౌదరి ఎంతో అందమైన పువ్వులతో బతుకమ్మను ఎంతో అందంగా అలంకరించారు అనంతరం కుటుంబ సభ్యులందరికీ కలిసి ఇంటి ముందు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

ఇక వీరితో పాటు వీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాకముందు యాంకర్ గా( Anchor Neha Chowdary Bathukkamma Celebrations ) పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు.

నేహా చౌదరి స్పోర్ట్స్ యాంకర్ గా కూడా పనిచేశారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చారు.

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?