మహేష్ బాబుతో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫోటో!
TeluguStop.com
తెలుగు టెలివిజన్ చలనచిత్ర నటి హిమజ.బుల్లితెర లో ప్రసారమైన సీరియల్ లో తన నటన ను పరిచయం చేసింది హిమజా.
భార్యమణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి దారావాహిక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత వెండి తెరపై అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసింది.
సోషల్ మీడియాలో షేర్ల తో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటుంది హిమజా. """/"/
స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఒకరైన హిమజా.
బిగ్ బాస్ తర్వాత తన ఇమేజ్ మొత్తం ఓ రేంజ్ లో మారింది.
సోషల్ మీడియాలో ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్ ల తో కలిసి కొన్ని పార్టీల లో పాల్గొన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
హిమజా కు బిగ్ బాస్ తర్వాత ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.ఇదిలా ఉంటే హిమజా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
మహేష్ బాబు తో దిగిన ఫోటో తో ఎంతో మురిసిపోయింది హిమజా.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో లో హిమజా ఖాకీ చొక్కా తో పోలీస్ గెటప్ లో ఆకట్టుకుంది.
బహుశా ఏదైనా షూటింగ్ సమయంలో పోలీస్ డ్రెస్ తో మహేష్ బాబు పక్కన ఫోటో దిగిందని నేటి జనులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.
అంతేకాకుండా హిమజా పొట్టి పొట్టి బట్టలతో, మోడ్రన్ దుస్తులతో, అప్పుడప్పుడు తెలుగు సాంప్రదాయ దుస్తులతో ఫోటో షూట్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటోను తెగ వైరల్ గా మారాయి.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?