పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బిగ్ బాస్ భామ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చిన చాలు అనుకునే నటులు చాలా మంది టాలీవుడ్ లో ఉన్నారు.

ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కి అభిమానులు కంటే భక్తులు ఎక్కువగా ఉన్నారని చెప్పాలి.అలాంటి భక్తిభావం ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని కలలు కంటారు.

ఇప్పుడు అలాంటి అవకాశాన్ని బిగ్ బాస్ ఫేమ్ హిమజ సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.

తాజాగా ఈ భామ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని షేర్ చేసి తన కల నిజమైంది అంటూ పోస్ట్ పెట్టింది.

సీరియల్స్ లో కెరియర్ ప్రారంభించి బిగ్ బాస్ తర్వాత సినిమాల మీద ఫోకస్ పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న హిమజ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ సొంతం చేసుకుంది.

ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలుపుతూ సెట్ లో పవన్ తో దిగిన ఫోటో ను షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.

ఓ మై గాడ్.ఇవాళ నా కోరిక నెర‌వేరింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి తొలిప్రేమ సినిమాలో చూసిన‌ప్పుడు ఆయ‌న‌ను క‌నీసం డైరెక్ట్‌గా చూస్తానా అనుకున్నా.

ఇవాళ నాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ 27వ చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.ఈ అవ‌కాశం ఇచ్చిన క్రిష్ గారికి థ్యాంక్స్.

మీతో ప‌ని చేయ‌డం చాలా సంతోషం అని సోష‌ల్ మీడియాలో కామెంట్ పెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా క్రిష్ మూవీకి సంబందించిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.

ఇదిలా ఉంటే మహా శివరాత్రికి ఈ సినిమాకి సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హిందూపురంలో టీడీపీ తరపున వసుంధర కూడా నామినేషన్ వేశారా.. ఏం జరిగిందంటే?