బెగ్గింగ్ చేస్తున్న బిగ్ బాస్ 7 రన్నర్ అమర్ స్నేహితుడు.. ఏమైందంటే?

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ ( Amar Deep ) ఒకరు.

సీరియల్ నటుడిగా గుర్తింపు పొందినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి మంచి గుర్తింపు పొందారు.

ఇక అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయనని సపోర్ట్ చేస్తూ తన స్నేహితుడు పెద్ద ఎత్తున వీడియోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

అదే విధంగా అమర్ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తూ అమర్ స్నేహితులు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు.

ఇలా అమర్ స్నేహితులలో ఒకరైనటువంటి వారిలో నరేష్ లొల్ల ( Naresh Lolla ) ఒకరు.

"""/" / ఈయన జానకి కలగనలేదు సీరియల్ లో అమర్ తమ్ముడి పాత్రలో నటించారు.

అలా వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఏర్పడింది.ఇక అమర్ గురించి ఈయన ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకోవడమే కాకుండా అమర్ పట్ల నెగిటివ్ ట్రోల్ చేసిన వారికి తన స్టైల్ లోనే సమాధానాలు చెప్పారు.

ఒకానొక సమయంలో నా కొడకల్లారా అంటూ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

లొల్లాస్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.ఇతరుల ఫేమ్ ని వాడుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేసి సంపాదిస్తున్నాడనే ఆరోపణలు ఈయనపై ఉండటంతో నువ్వు అందరిని అడుక్కుతింటున్నావ్ అంటూ నేటిజన్స్ దారుణంగా కామెంట్లు చేసేవారు.

"""/" / ఇలా అందరూ తనని అడుక్కుతింటున్నావ్ అని అనడంతో ఈయన ఒక ప్లాన్ చేసి అందరూ నన్ను అడుక్కు తింటున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

సరే నేను నిజంగానే అడుగు తింటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒక్క రూపాయి దానం చేయండి అంటూ ఈయన ఒక వీడియో ద్వారా తెలియజేశారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి దానం చేయటం వల్ల దానిని నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారికి అందజేస్తాను అంటూ తెలియజేశారు.

ఇప్పటికీ ఇలా తను 60000 సంపాదించాలని అయితే ఆ డబ్బును ఎవరికి ఇస్తున్నాను అనే విషయాన్ని మరొక వీడియోలో తెలియచేస్తాను అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ సంక్రాంతి సినిమాలలో మూడు సినిమాలు ఫ్లాప్.. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా?