మొన్ననే హీరోయిన్గా ఛాన్స్…అప్పుడే కొత్త ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ?
TeluguStop.com
యూట్యూబ్( YouTube ) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన అలేఖ్య హారిక( Alekhya Harika ) యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇక యూట్యూబ్ ద్వారా ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి హారిక అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.
బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలోనూ వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు హీరోయిన్గా సినిమా అవకాశం వచ్చింది.
"""/" /
సంతోష్ శోభన్( Santosh Soban ) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో బేబీ( Baby ) నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్( Sai Rajesh ) కలిసి నిర్మిస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా, ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయింది.
ఇలా హీరోయిన్ గా ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగానే ఈమె తాజాగా నూతన గృహప్రవేశం ( House Warming ) చేసినట్లు తెలుస్తోంది.
ఇన్ని రోజులు యూట్యూబ్ ద్వారా భారీ స్థాయిలో సంపాదించిన హారిక తాజాగా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారు.
"""/" /
ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను హారిక సోషల్ మీడియాలో షేర్ చేయకపోయినా గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లినటువంటి పలువురు యూటూబర్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా దీప్తి సునయన, కాజల్, శివ జ్యోతి వంటి వారందరూ కూడా ఈ గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.
ప్రస్తుతం వీరు షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్లు ఇవే.. టికెట్ రేట్లు ఎంతంటే?