అఖిల్ ,మోనాల్ మధ్య ప్రేమ నిజమే.. ఇదే సాక్ష్యం..?
TeluguStop.com
స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 4 గురించి అందరికీ తెలిసిందే.
ఎందుకంటే అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.ఇక అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
తమదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో తెగ పోస్టులను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఓ ప్రేమ జంట పుట్టుకొస్తుంది.
ఇలా వరుసగా నాలుగు సీజన్లలో జరిగిన కథే.ఇక సీజన్ 4 లో అఖిల్ మోనాల్ ల ప్రేమ కథ మాత్రం ఓ రేంజ్ లో సాగింది.
వారి మధ్య జరిగిన రొమాంటిక్ కథ అందరిని బాగా ఆకట్టుకుంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకే వీళ్ళ ప్రేమాయణం సాగుతుందని ప్రేక్షకులు అనుకోగా.
బిగ్ బాస్ తర్వాత కూడా వీరి మధ్య ప్రేమ మరింత దృఢంగా మారిందని అర్థమవుతుంది.
వీళ్ళు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ తెగ వైరల్ గా మారాయి.
"""/"/
కాగా ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొనగా.వారి మధ్య ఉన్న ప్రేమ నిజమే అని అందరికీ అర్థమైంది.
ప్రస్తుతం స్టార్ మా లో బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ఓ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఇందులో బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు బాగా అలరించారు.
ఇందులో అఖిల్ మోనాల్ మధ్య జరిగిన సంభాషణ అందరిని ఆశ్చర్యపరిచింది.వారిద్దరు ఒకరినొకరు టైట‌్ హగ్ ఇచ్చుకొని రొమాంటిక్ గిఫ్ట్ లను ఇచ్చుకున్నారు.
వారి మధ్య ఉన్న ప్రేమని బయటపెట్టారు.మోనాల్ కోసం అఖిల లైవ్ సాంగ్ పాడారు.
దీంతో మోనాల్ డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.ఇక అఖిల్ మోనాల్ కోసం కాళ్ల పట్టీలు తీసుకొచ్చి.
తన కాళ్ళను మోకాళ్ళ పై పెట్టి తానే స్వయంగా పట్టీలు అలంకరించాడు.ఇది చూసిన మిగత కంటెస్టెంట్ లు ఆశ్చర్యపోయారు.
అంతేకాకుండా మోనాల్ గంగవ్వ కు చీరను గిఫ్టుగా ఇచ్చింది.చీర కలరు బాగుందని గంగవ్వ అనగా.
మరి ఈ చీర మోనాల్ పెళ్లికి కట్టుకుంటావా అని శ్రీముఖి ప్రశ్నించింది.దీంతో గంగవ్వ.
లేదు అఖిల్ కూడా తెస్తాడు గా అది కట్టుకుంటా అని కౌంటర్ వేసింది.
తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా… ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!