Adi Reddy: బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి నెల సంపాదన ఎన్ని లక్షలో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!
TeluguStop.com
బిగ్ బాస్ 6 ( Biggboss6 ) లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి.
ఇక ఈయన ఎంట్రీ ఇచ్చాక చాలామంది రెండు మూడు వారాలకే హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు అని అందరూ భావించారు.
కానీ ఆయన ఆట తీరుతో అందరిని మెప్పించి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచాడు.
స్టార్ సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టి టాప్ ఫోర్ ప్లేస్ సంపాదించుకున్నారు.
ఇక బిగ్ బాస్ లో ఆదిరెడ్డి చేసే డ్యాన్స్ కి చాలామంది అభిమానులు ఉన్నారు.
మరీ ముఖ్యంగా ఆదిరెడ్డి డ్యాన్స్ ని అడిగి మరీ చేయించుకునేవారు నాగార్జున( Nagarjuna ) .
అయితే అలాంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్ కాకముందు చాలా పేదరికంలో ఉండేవారట.
అంతేకాదు తన తల్లి బంగారు ఆభరణాలు లేక ఏవైనా ఫంక్షన్లు, పండగలు జరిగితే ఇతరుల బంగారు నగలను వేసుకొని ఆ ఫంక్షన్ కి వెళ్లేదట.
అలాగే తన తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తన చెల్లికి కళ్ళు కనిపించవని బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి ఎమోషనల్ అయినా సంగతి మనకు తెలిసిందే.
ఇక తన ఫ్రెండ్స్ సలహాలు చెప్పడం ద్వారా బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ కొద్ది రోజుల్లోనే రివ్యూవర్ గా మంచి గుర్తింపు సంపాదించారు.
ఇక ఈయన ఫేమస్ అవ్వడంతో బిగ్ బాస్ 6 లో కూడా కామన్ మ్యాన్ కేటగిరిలో అవకాశం ఇచ్చారు.
అయితే ఈ హౌస్ లో యూట్యూబర్ గీతు రాయల్ ( Geethu Royal ) ఆదిరెడ్డి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది.
"""/" /
కానీ వీరిద్దరి ఫ్రెండ్షిప్ పై ఆదిరెడ్డి ( Adi Reddy ) భార్య సీరియస్ అయిందని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఒక నెల సంపాదన ఎంతో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.
స్టార్ సెలబ్రెటీల( Star Celebrities ) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.అయితే చాలామంది ఆదిరెడ్డిని డబ్బులు తీసుకొని ఫేక్ రివ్యూలు చెబుతూ ఉంటాడు అని ఆరోపించారు.
"""/" /
అయితే ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా ఆదిరెడ్డి యూట్యూబ్ లెక్కలను బయట పెట్టి అవును నేను పెయిడ్ రివ్యూవర్ నే నాకు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు.
అంటూ లెక్కలు బయటపెట్టారు.ఇక ఆదిరెడ్డి షేర్ చేసిన ఆ లెక్కల్లో దాదాపు ఆదిరెడ్డి నెలకు 39 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన ఆదిరెడ్డి స్టార్ సెలబ్రిటీల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నట్టు సమాచారం.
Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet