బాలయ్యలో ఈ రెండు షేడ్స్ ఉన్నాయి..బిగ్ బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ఎంత మంచి సక్సెస్ అందుకున్న బాలయ్య తదుపరి చిత్రం బాబీ( Bobby ) డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా బాలకృష్ణ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ ఆలస్యమైంది ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది అని తెలుస్తుంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/08/Bigg-Boss-i-interesting-comments-about-balakrishnac!--jpg" / ఇక ఈ సినిమా ప్రస్తుతం NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాకు వివిధ రకాల టైటిల్స్ ఖరారు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఏ విధమైనటువంటి టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్నటువంటి బిగ్ బాస్ బ్యూటీ దివి( Divi ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య గురించి వెల్లడించారు.

బాలకృష్ణ గారిలో రెండు షేడ్స్ ఉన్నాయని తెలిపారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/08/Bigg-Boss-i-interesting-comments-about-balakrishnad!--jpg" / ఆయన ఒక రాజకీయ నాయకుడి( Political Leader ) గా ప్రజలతో ఎలా నడుచుకోవాలో తెలుసు అలాగే ఒక నటుడిగా సినిమాలలో నటించేటప్పుడు ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలో కూడా తెలుసని వెల్లడించారు.

ఇక బాలకృష్ణ పెద్ద నటుడు ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటేనని వెల్లడించారు.

చిన్న ఆర్టిస్టుల నుంచి మొదలుకొని పెద్ద సెలబ్రిటీల వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరితో చాలా మంచిగా ఉంటారని సరదాగా నవ్వుతూ మాట్లాడతారని తెలిపారు.

బాలయ్య షూటింగ్ లొకేషన్లోకి వస్తే అక్కడి వాతావరణం మొత్తం మారిపోతుందని దివి వెల్లడించారు.

ఇక నటన పరంగా డైలాగ్స్ చెప్పే విషయంలో బాలయ్యకు ఎవరు సాటి రారని ఆయన స్క్రీన్ ప్రజెంట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

బాలకృష్ణ ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ ఈమె బాలయ్య గురించి ఎంతో గొప్పగా తెలిపారు.

బలగం డైరెక్టర్ డైరెక్షన్ లో నితిన్.. ఈ సినిమాతో నితిన్ జాతకం మారడం ఖాయమా?