నా కట్టే కాలేంత వరకు వారి కోసమే పోరాడుతానంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్…

తెలుగులో అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న "బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో" మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తి కార్తీక గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే ఈమె విదేశాల్లో చదువుకున్నప్పటికీ మాతృభాష పై ఉన్నటువంటి మమకారంతో ఖరీదైన జీతాలను కూడా వదులుకుంది.

దాంతో ప్రస్తుతం పలు రకాల షోలు, ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అయితే కత్తి కార్తీక ఇటీవలే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో చేరింది.

ఇందులో భాగంగా కత్తి కార్తీక తెలంగాణ రాష్ట్రంలోని "దుబ్బాక" నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందిస్తూ కత్తి కార్తీక తన కట్టే కాలేంత వరకూ దుబ్బాక ప్రజల సంక్షేమానికి పాటు పడతానని ప్రజలకి వాగ్దానం చేసింది.

అంతేగాక ప్రజాసేవలో ఉన్నటువంటి తృప్తి మరెందులోనూ కలగదని తెలిపింది.అలాగే వచ్చే ఉప ఎన్నికలలో దుబ్బాక నియోజక వర్గ ప్రజలు తనకి ఓట్లు వేసినా, వేయకపోయినా తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపింది.

దీంతో కొందరు నెటిజన్లు కత్తి కార్తీక పొలిటికల్ ఎంట్రీ పై స్పందిస్తూ సినిమాలు వేరు, రాజకీయం వేరని కాబట్టి మరోమారు ఎన్నికలలో పోటీ చేసే ముందు ఆలోచించుకోవాలని ఆమెకి సూచిస్తున్నారు.

అంతేగాక గతంలో ఇలాంటి వాగ్దానాలు చేసినటువంటి ఎందరో నటీనటులు ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయ్యారని కామెంట్లు చేస్తున్నారు.

కానీ కత్తి కార్తీక ఇలాంటి కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న కత్తి కార్తీక కొంత కాలం పాటు ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.

 ఆ తర్వాత తానే సొంతంగా ఓ ఆర్గనైజేషన్ ద్వారా కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేందుకు నిధులు కలెక్ట్ చేసి ప్రజలకి సహాయ పడింది.

ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!