బిగ్ బాస్ కంటెస్టెంట్లు అలా లక్షలు సంపాదిస్తున్నారా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈ కంటెస్టెంట్లలో అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ రన్నర్ గా సోహెల్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచారు.

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఐదారుగురికి మినహా ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు.

సీజన్ 4 కంటెస్టెంట్లలో ఒకరిద్దరికి అవకాశాలు వస్తున్నా బిగ్ బాస్ క్రేజ్ వాళ్లకు ఉపయోగపడుతుందా.

? లేదా.? అంటే మాత్రం సందేహమే అని చెప్పవచ్చు.

అయితే బిగ్ బాస్ షోలో సీజన్ 5 ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా అవకాశాలు, సరైన గుర్తింపు లేని సినిమా, సీరియల్ నటులు, యూట్యూబ్ స్టార్లు, యాంకర్లు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇలా వీళ్లంతా బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నవారికి సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.

కొన్ని కంపెనీలు బిగ్ బాస్ కంటెస్టెంట్ల ద్వారా తమ బ్రాండ్ లను ప్రమోట్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాపులారిటీ కావాలని కోరుకునే వాళ్లకు బిగ్ బాస్ షో సరైన వేదిక అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత కొందరు కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానెళ్లను స్టార్ట్ చేసే లక్షల రూపాయల ఆదాయం సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే బిగ్ బాస్ షో చాలామందికి ప్లస్ అవుతున్నా కొందరు కంటెస్టెంట్లు మాత్రం బిగ్ బాస్ షోలో ప్రవర్తన వల్ల అవకాశాలను పోగొట్టుకుంటూ ఉండటం గమనార్హం.

బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నవారు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అవకాశాలు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు.

ఓట్స్, బీట్ రూట్.. స్కిన్ విషయంలో ఈ కాంబినేషన్ చేసే మ్యాజిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!