బిగ్ బాస్ లీక్స్.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఆమేనంట..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 14వ వారం ఎలిమినేషన్స్ కు అఖిల్ మినహా అందరూ నామినేట్ కాగా ఈరోజు మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

నిజానికి చాలా వారాల క్రితమే మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి ఉన్నా ఊహించని విధంగా ఆమె సేవ్ అవుతూ వస్తోంది.

అయితే గ్రాండ్ ఫినాలేకు మరో వారం మాత్రమే ఉండటం, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో మోనాల్ వీక్ కంటెస్టెంట్ కావడంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కాక తప్పలేదని తెలుస్తోంది.

ఇప్పటికే అఖిల్ టాప్ 5లో చోటు దక్కించుకోగా నిన్నటి ఎపిసోడ్ లో సోహైల్ టాప్ 5లోకి చేరాడు.

అభిజిత్, అరియానా, హారిక ఈరోజు టాప్ 5లోకి చోటు దక్కించుకోనున్నారని బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ ను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ మోనాల్ కోసం గతంలో కుమార్ సాయి, అవినాష్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అభిజిత్, అఖిల్, మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక విధంగా ఆమె హౌస్ లో ఇన్నిరోజులు ఉండటానికి కారణమైంది.

బిగ్ బాస్ షోను చూసే ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం మోనాల్ ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో సుడిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించి మోనాల్ గుర్తింపు తెచ్చుకున్నారు.సుడిగాడు సినిమా తరువాత ఆమె అడపాదడపా సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మోనాల్ కు కొత్త సినిమా అవకాశాలు వస్తాయో రావో చూడాల్సి ఉంది.

మరో పోస్ట్ తో అడ్డంగా దొరికిపోయిన శోభిత… చైతన్యతో రిలేషన్ లో ఉన్నట్టేనా?