హైదరాబాద్ లో ఇల్లు కొనబోతున్న మోనాల్.. ఖరీదెంతంటే..?

సాధారణంగా అవకాశాలు తగ్గి ప్రేక్షకులు మరిచిపోయిన హీరోయిన్లు మళ్లీ వరుస అవకాశాలతో బిజీ కావడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

అయితే మోనాల్ గజ్జర్ మాత్రం బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డాన్స్ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ కు 12 లక్షల రూపాయల వరకు పారితోషికం దక్కిందని తెలుస్తోంది.

మోనాల్ కు మరికొన్ని కొత్త సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో మోనాల్ హైదరాబాద్ కు మకాం మారుస్తున్నారని తెలుస్తోంది.

అయితే కొత్త ఇల్లు విషయంలో మోనాల్ ఖర్చుకు వెనుకాడటం లేదని వరుస ఆఫర్లు, బిగ్ బాస్ నుంచి భారీ మొత్తం దక్కడంతో ఖరీదైన ఫ్లాట్ నే మోనాల్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

"""/"/ మరోవైపు మోనాల్ కు అడ్వాన్స్ లు కూడా భారీగానే వస్తున్నాయని సమాచారం.

బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలు ఉన్న మోనాల్ అభిజిత్, అఖిల్ తో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అయ్యారు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం అఖిల్ తోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.

టీవీ షోలు, సినిమాలతో పాటు మోనాల్ కు వెబ్ సిరీస్ లలో కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

ఇతర భాషల్లో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు దక్కటంతో టాలీవుడ్ కే పరిమితం కావాలని మోనాల్ భావిస్తున్నారని సమాచారం.

బిగ్ బాస్ షో ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు మోనాల్ కు రెమ్యునరేషన్ గా దక్కినట్టు తెలుస్తోంది.

స్టార్ హీరో అబ్బాస్ సంపదలు కోల్పోవడం వెనుక అసలు కారణాలు ఇవేనా?