బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఆ నటితో ప్రేమలో పడ్డారా... ట్విస్ట్ అదిరింది!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది నటీనటులు సింగర్స్ మోడల్స్ ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో నటుడు అర్జున్ కళ్యాణ్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని అయితే ఆ ప్రేమ విఫలమైందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అయితే ఈయన ప్రేమించిన నటి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.అర్జున్ కళ్యాణ్ నటి పూజిత పొన్నాడతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.

పూజిత పొన్నాడ మొదటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకునే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోని ఈమె రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి లవర్ పాత్రలో నటించారు.

ఇకపోతే ఈమె వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ నటిన పై ఆసక్తితో సినిమాలలో నటిస్తున్నట్లు వెల్లడించారు ఇకపోతే తాను నటుడు అర్జున్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన విషయాన్ని కూడా ఈమె వెల్లడించారు.

"""/"/ తాజాగా ఆకాశవీధిలో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజిత తన ప్రేమ గురించి మాట్లాడుతూ తను అర్జున కళ్యాణ్ తో ప్రేమలో పడిన మాట నిజమేనని అయితే కొన్ని కారణాల వల్ల తామిద్దరం విడిపోయామని తెలిపారు.

అయితే ఈమె తనతో బ్రేకప్ వచ్చినప్పటికీ మేమిద్దరం మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నామని అర్జున్ కి బిగ్ బాస్ అవకాశం వచ్చిందని తెలియగానే తాను ఎంతో సంతోష పడటమే కాకుండా తనకు ఆల్ ది బెస్ట్ చెప్పానంటూ ఈ సందర్భంగా అర్జున్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన విషయాన్ని తెలిపారు.

వామ్మో.. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే! (వీడియో)