దుబాయిలో కోట్లు విలువ చేసే ఇల్లు కొన్నా బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరంటే?
TeluguStop.com
బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమంతు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఈ క్రమంలోని వివిధ భాషలలో ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.
ఈ కార్యక్రమం తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే హిందీలో ఈ కార్యక్రమం ఏకంగా 15 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం 16వ సీజన్ ప్రసారం అవుతుంది.
15వ సీజన్లో భాగంగా కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో తేజస్వి ప్రకాష్.కరణ్ కుంద్రా చేసిన అల్లరి ప్రేక్షకులను కట్టిపడేసింది.
బిగ్ బాస్ హౌస్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/"/
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి ప్రకాష్ తన ప్రియుడు కరణ్ కుంద్రాతో కలిసి దుబాయ్ లో ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసినట్టు సమాచారం.
1BHK ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.అన్ని సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ రెండు కోట్ల రూపాయల విలువ చేసిందని సమాచారం.
బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తేజస్వి నాగిన్ సిరీస్‌తో పాటు మరాఠీ చిత్రంలో చేస్తోంది.
ఇటీవలే ఆమె గోవాలో తన సొంత ఇంటిని కొనుగోలు చేసింది.అదేవిధంగా కరుణ్ కుంద్ర ముంబైలో కూడా ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి.
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు 3 సంవత్సరాలకు సరిపడ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..?