Arjun Ambati : విరూపాక్ష సినిమాలో హీరోగా నాకే ఛాన్స్ వచ్చింది.. బిగ్ బాస్ అర్జున్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర సీరియల్ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అర్జున్ అంబటి( Arjun Ambati ) ఒకరు.

ఈయన పలు బుల్లితెర సీరియల్స్ లో నటించిన గుర్తింపు పొందారు.అనంతరం పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇక ఇటీవల బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లిన తర్వాత ఈయన క్రేజ్ మరింత మారిపోయిందని చెప్పాలి.

బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండి తెర సినిమా అవకాశాలను కూడా అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి అర్జున్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

"""/" / ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) గురించి మాట్లాడుతూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో నటుడు సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

నిజానికి ఈ సినిమాలో హీరోగా నేనే నటించాల్సి ఉంది అంటూ అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్( Director Karthik ) నేను చాలా మంచి స్నేహితులు మేమిద్దరం కలిసి ఒక వెబ్ ఫిలిం కూడా చేశామని తెలిపారు.

"""/" / విరూపాక్ష సినిమా కథ రాసుకున్న తర్వాత ఆ కథను నాకు చెప్పగా చాలా నచ్చింది.

ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నాము అయితే నిర్మాతల కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు తిరిగిన ఎవరు కూడా మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదని ఈయన తెలిపారు.

ఇక ఇదే కథతో సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్లగా వర్క్ అవుట్ అయిందని ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుందని తెలిపారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు ఛాన్స్ మిస్ చేసుకున్నానని నేను ఎప్పుడు బాధపడలేదు అని బహుశా కార్తీక్ నాతో కనుక ఈ సినిమా చేసి ఉంటే అంత సక్సెస్ కాదేమో అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు పోకిరి మరియు బిజినెస్ మాన్ సినిమాల వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు ?