ప్రేమ క్యాన్సర్ లాంటిది.. మోనాల్ పై అఖిల్ కామెంట్స్ వైరల్..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ అఖిల్ జంట మంచి పేరును సంపాదించుకుంది.

బిగ్ బాస్ హౌస్ తర్వాత కూడా బయట మోనాల్ అఖిల్ బంధం కొనసాగుతోంది.

ఈ జంటకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్మాత ఈ జంటతో వెబ్ సిరీస్ ను నిర్మిస్తుండగా భవిష్యత్తులో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సీజన్ 4 బెస్ట్ కపుల్ గా మోనాల్, అఖిల్ మంచి పేరు సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి ఒక విధంగా మోనాల్ అఖిల్ జంట కారణమని చెప్పవచ్చు.

మరోవైపు బిగ్ బాస్ షోలో ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సి ఉన్నా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం మోనాల్ ను 14వ వారం వరకు ఉంచడం గమనార్హం.

మోనాల్ అఖిల్ ఇంటర్వ్యూలలో తాము మంచి స్నేహితులని చెప్పినా వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

"""/"/ అయితే తాజాగా మోనాల్ విషయంలో అఖిల్ చేసిన కామెంట్లు వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పకనే చెప్పేశాయి.

అఖిల్, మోనాల్ వీడియో కాల్స్ చేసుకుంటూ ఉండగా తాజాగా అఖిల్ మోనాల్ తో వీడియో కాల్ చేసిన స్క్రీన్ షాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ తరువాత లవ్ క్యాన్సర్ లాంటిదని.ప్రేమ మరిచిపోయేలా చేయడంతో పాటు చివరకు ప్రాణాలను కూడా తీసుకెళుతుందని కామెంట్ చేశారు.

అఖిల్ మోనాల్ పై ప్రేమను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వెల్లడించడం గమనార్హం.భవిష్యత్తులో మోనాల్ అఖిల్ జంట పెళ్లి కూడా చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

మోనాల్ అఖిల్ బంధం అభిమానులను కూడా కన్ఫ్యూజ్ చేస్తుండటం గమనార్హం.మోనాల్ అఖిల్ నటిస్తున్న వెబ్ సిరీస్ మరికొన్ని నెలల్లో విడుదల కానుంది.

మోచేతుల నలుపును సహజంగా పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది!