ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు… వైరల్ అవుతున్న బిగ్ బాస్ 8 కొత్త ప్రోమో?
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss 8 ) కార్యక్రమం కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ లోగో ప్రోమో ఈ కార్యక్రమం పై చాలా అంచనాలను పెంచేశాయి.ఇందులో 8 ఇన్ఫినిటీ రూపంలో చూపించడంతో ఈసారి ఈ కార్యక్రమం మరింత ఎంటర్టైన్మెంట్ అందించబోతుందని, వినోదానికి లిమిట్ లేదని చెప్పకనే చెప్పేసారు.
"""/" /
ఇలా ఇప్పటివరకు విడుదలైన ఈ లోగో ప్రోమో ఈ షోపై అంచనాలను పెంచేసింది.
అయితే తాజాగా మరొక కొత్త ప్రోమో విడుదల చేశారు.ఇందులో నాగార్జున( Nagarjuna ) కమెడియన్ సత్య( Satya ).
మధ్య జరిగిన సంభాషణ ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఇందులో సత్య దొంగగా నటిస్తూ ఒక షాప్ కి వెళ్లి అక్కడ అద్భుత దీపాన్ని తాకుతాడు.
అందులో నుండి జీనీ రోపంలో నాగార్జున వస్తాడు. """/" /
ఇలా నాగార్జునని చూసిన సత్య భయపడగా నువ్వేమి భయపడకు నీకేం కావాలో కోరుకో అంటూ వరాలు ఇస్తాడు.
నిజంగానే ఇస్తారా అంటూ సత్య ప్రశ్నించగా.నేను ఒక్కసారి కమిట్ అయితే లిమిటే ఉండదు అంటూ నాగార్జున చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈయన ఈ సీజన్లో లిమిట్ ఉండదు అన్ లిమిటెడ్ ( Un Limited ) గా ఇస్తానని చెప్పడం చూస్తుంటే సీజన్ లో మరింత రెట్టింపు వినోదం ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన పేర్లు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!