బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఆమేనా.. ఎవరంటే?

తెలుగులో ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )మొదలైన విషయం మనందరికీ తెలిసిందే.

ఇటీవల మొదలైన ఈ షో చూస్తుండగానే అప్పుడే ఒక వారం రోజులు పూర్తి చేసుకుంది.

ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న మొదటి వారం ఎలిమినేషన్ దగ్గర పడింది.

ఈరోజు రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం తెలియనుంది.

కాగా 14 మంది కంటెస్టెంట్లు అటు హౌస్ లోకి వెళ్ళగా మొన్నే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే.

అయితే ఇక ఇలా హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ గురించి ప్రేక్షకులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు.

అంతలోనే ఏకంగా ఎలిమినేషన్ రానే వచ్చింది. """/" / తాజాగా బిగ్బాస్ హౌస్ నుంచి ప్రోమోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎప్పటిలాగే నాగార్జున ( Nagarjuna )హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల అందరి తప్పులను చెబుతూ అందరికీ క్లాస్ పీకుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే నేడు నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

అయితే ఇలా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి.

అయితే మొదటి వారిమే కావడంతో అటు కంటెస్టెంట్స్ మధ్య పెద్దగా పరిచయాలు కూడా అవ్వలేదు.

దీంతో ఏ కారణం చూపాలో తెలియక చిన్నచిన్న కారణాలతోనే నామినేషన్స్ కూడా చేసుకోవడం చూశాము.

అయితే అటు ప్రేక్షకులకు కూడా ఎవరు ఏంటి అన్నది అర్థం కాలేదు కానీ ఏదో ఓట్లు మాత్రం వేశారు.

"""/" / దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

విష్ణుప్రియ, శేఖర్ భాషాలకు( Vishnupriya , Shekhar Basha ) మంచి క్రేజ్ ఉండడంతో ఇద్దరికీ బాగానే ఓట్లు పడ్డాయట.

ఇక సింపతి కార్డు వాడుకున్న మణికంఠకు కూడా జనంలో వర్కౌట్ అయిందట.పృథ్వి, సోనియా ఆకుల బాగానే ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది.

అయితే ఎటోచ్చి ఇప్పుడు బెజవాడ బేబక్క( Bejawada Bebakka ) మాత్రం డివిజనల్ రోల్ లో ఉందట.

మంచి మాటకారి అయిన బేబక్క హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయారు.

బిగ్బాస్ అర్థం కాక ఇలా ఉండిపోయారు అనేది తెలుస్తోంది.దీంతో బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేస్తూ దొరికిన విష్ణుప్రియ.. పరువు మొత్తం పోయిందిగా!