హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss 8 ) తెలుగు కార్యక్రమం 13వ వారానికి చేరుకుంది.

ఇక ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఓటింగ్ ప్రకారం పృథ్విరాజ్, అవినాష్, టేస్టీ తేజ వరుసగా లీస్టులో ఉన్నట్టు తెలుస్తోంది.

కానీ టికెట్ ఫినాలే రేసులో అవినాష్ షో ఊహించని విధంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి వెళ్ళిపోగా ఇక మిగిలినది టేస్టీ తేజ పృథ్వీరాజ్ అని తెలుస్తుంది.

ఇక వీరిద్దరూ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం.ఇక పృధ్విరాజ్ ఈ కార్యక్రమం మొదటి నుంచి హౌస్ లో కొనసాగుతూ ఉండగా టేస్టీ తేజ మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదు వారాల తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టారు.

"""/" / ఇక టేస్టీ తేజ ( Tasty Teja ) హౌస్ నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఈయన ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారు ఏంటి అనే విషయాలు గురించి చర్చలు జరుగుతున్నాయి.

టేస్టీ తేజ దాదాపు 8 వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ ఉన్నారు.ఇక ఈయన వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.

వారానికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకొని టేస్టీ తేజ హౌస్ లోకి అడుగు పెట్టారని సమాచారం.

"""/" / ఇక ఈయన 8 వారాలపాటు హౌస్ లో కొనసాగడంతో సుమారు 32 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

ఇకపోతే సీజన్ 7 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన అప్పుడు కూడా దాదాపు తొమ్మిది వారాలపాటు హౌస్ లో కొనసాగారు.

అయితే గత సీజన్లో ఈయన రెమ్యూనరేషన్ వారానికి 1.5 లక్షల వరకు తీసుకున్నారని తెలుస్తుంది.

ఇలా గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లోనే టేస్టీ తేజ భారీ స్థాయిలో సంపాదించారని తెలుస్తోంది.

పుష్పను రిజెక్ట్ చేయకపోతే మహేష్ కు ఇప్పటికే ఆ ఇమేజ్ వచ్చేదా.. వదిలేసి తప్పు చేశారా?