గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్!

జార్జి రెడ్డి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సోనియా ( Sonia ) ఆకుల.

ఇక ఈ సినిమా తర్వాత ఈమె రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) దర్శకత్వంలో వచ్చిన దిశ ఎన్కౌంటర్ కరోనా వైరస్ వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి ఒక్కసారిగా సంచలనంగా మారారు.

ఇలా ఈ సినిమాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సోనియా అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss 8 ) సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు.

ఈమె ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి వారం ఈమె ఆట తీరు చూసిన అభిమానులు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటుందని భావించారు కానీ రెండవ వారంలోని ఈమె అసలు స్వరూపం బయటపడింది.

"""/" / ఈ విధంగా హౌస్ లో సోనియా సేఫ్ గేమ్ ఆడటం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చకపోవడంతో ఈమెను నాలుగవ వారమే హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

ఇలా హౌస్ లో ఉన్నది నాలుగు వారాలు అయినప్పటికీ ఈమె గురించి భారీగా నెగిటివిటీ ఏర్పడింది దీంతో హౌస్ నుంచి బయటకు రాగానే తన పట్ల జరిగిన డ్యామేజ్ క్లియర్ చేసే పనిలో బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా ఈమె తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేమీ జరగలేదు.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా సోనియా తన ప్రియుడిని నిశ్చితార్థం( Engagment ) చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

ఈమె నిశ్చితార్థం ఈనెల 21వ తేదీ జరిగిన బయట ఎక్కడ తెలియజేయలేదు అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక ఈమె తన ప్రియుడు యశ్ పాల్ (Yash Pal) అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు.అయితే ఇదివరకే ఈయనకు పెళ్లి జరిగి తన భార్యకు విడాకులు ఇచ్చారని సోనియాను రెండో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు .

టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… బన్నీకి మద్దతు తెలిపిన నటి!