Shakeela : అందుకే అడల్ట్ సినిమాలు చేశా.. ఇంట్లో వాళ్లు అందుకే ఏమనలేదు.. షకీలా సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి షకీలా ( Shakeela )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అఖిల పేరు వినగానే ముందుగా ఆమె సినిమాలలో చేసిన బోల్డ్ పాత్రలే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి.
అయితే చాలామంది రీల్ లైఫ్ లో ఆమె అలాంటి పాత్రలు చేయడంతో రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుందని భ్రమపడ్డారు.
ఆ సంగతి అటువంటి తాజాగా ఈ షకీలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
14 మంది ఎంట్రీ ఇవ్వగా అందులో షకీలా కూడా ఒకరు.ఇక బిగ్ బాస్</em( Bigg Boss 7 ) హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన రోజే స్టేజ్ పై ఆమె గొప్ప మనసు గురించి అందరికీ తెలిపారు హోస్ట్ నాగార్జున.
"""/" /
అప్పుడే ఆమె అక్కడ సగం మార్కులు కొట్టేసింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో విషయానికి వస్తే.
దాదాపు 20 మంది కంటెస్టెంట్లతో కళకళలాడే హౌస్‌లో ఈసారి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు.
పోనీ వారికి సకల సౌకర్యాలు కల్పించారా? అంటే అదీ లేదు! 14 మందికి సరిపడా బెడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి.
ఈ బెడ్స్ సంపాదించుకోవడానికి ఏదో టాస్క్ పెట్టేట్లు ఉన్నాడు బిగ్‌బాస్.అందరితో కలిసిపోయిన టేస్టీ తేజ అదేదో ఈపాటికే చేసి ఉంటే కంటెస్టెంట్లకు కొంత ఉపశమనం లభించేది.
కంటి నిండా నిద్రపోయే భాగ్యం దక్కేది. """/" /
ఇకపోతే ఈ వారం శోభా శెట్టి, రతిక( Ratika ), ప్రిన్స్ యావర్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్, షకీలా, దామిని నామినేషన్స్‌లో ఉన్నారు.
యూట్యూబ్‌లో సెలబ్రిటీలతో భోజనాలు చేస్తూ ఇంటర్వ్యూ చేసే అతడు తాజాగా హౌస్‌లో షకీలాను సైతం ఇంటర్వ్యూ చేసి తన మనసులో సందేహాలను తీర్చేసుకున్నాడు.
అసలు మీరెందుకు అలాంటి సినిమాలే చేశారు? అని అడిగాడు.ఆ ప్రశ్నకి షకీలా స్పందిస్తూ.
ఆ సమయంలో నాకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయాను.అప్పట్లో నాకు అడల్ట్ సినిమా ఆఫర్లే ఎక్కువగా వచ్చాయి.
అంతకుముందు చిన్నచిన్న గ్లామర్ చిత్రాలు చేశాను.నిక్కర్లు వేసుకుని గ్లామర్‌గా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు అలాంటి సినిమాల్లో చేస్తే తప్పేంటనిపించింది అంటూ బదులిచ్చింది.
అలాంటి సినిమాలు ఎన్ని చేశారని అడగ్గా 500కు పైగా నటించాను అని తెలిపింది షకీలా.
( Shakeela ) మరి మీ ఇంట్లో ఏమీ అనలేదా? అని అడగ్గా.
డబ్బులు బాగా వచ్చేవి కదా అందుకే ఏమీ అనలేదు.అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటి? అని అడిగేసరికి తేజ తన ప్రశ్నల పరంపరకు చెక్ పెట్టాడు.
మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… గుడ్ న్యూస్ చెప్పిన నటి!