Sivaji : శివాజీకి భారీ షాకులిస్తున్న బిగ్ బాస్.. ఓట్లు పడినా వేటు పడే ఛాన్స్ ఉందంటూ?

బిగ్ బాస్ షోలో( Bigg Boss ) నటుడు శివాజీ కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

అయితే హౌస్ లో శివాజీ ( Sivaji )ఆటలు ఇన్ని రోజులు సాగుతూ వచ్చాయి.

కానీ ఇక మీదట అవకాశం లేదు.ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చిన శివాజీ మాత్రం ఓట్లు పడినప్పటికీ వేటుపడే ఛాన్స్ ఉందని ఎక్కువగా తెలుస్తోంది.

కాగా ఇటీవలె శివాజీకి బిగ్‌బాస్ వార్నింగ్ లాంటి హింట్‌ ఇచ్చాడు.మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు.

నొప్పి ఎలా ఉందని అడుగుతూనే ఇకపై హౌస్‌లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు.

"""/" / శివాజీ( Sivaji ) మాత్రం ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు.

చివరగా నాగార్జున ( Nagarjuna )సర్ది చెప్పడంతో కొనసాగుతానని అన్నాడు.అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ బిగ్‌బాస్ ఇచ్చిన హింట్‌ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు.

కరెక్ట్‌గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్‌గా అర్థమైపోయింది.ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి.

అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు.అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్‌లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడు.

దాంతో టికెట్ టూ ఫినాలే పోరు మొదలైంది.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలను బట్టి చూస్తే మూడు గేమ్స్ పెట్టగా.

శివాజీ అడ్డంగా దొరికిపోయాడు.ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు.

"""/" / ఇలా వరస షాక్‌లు తగిలాయి.ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు.

ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది.అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు.

గేమ్స్‌లోనూ గెలవాల్సి ఉంటుంది.ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ లాక్కొచ్చేశాడు.

కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా.శివాజీ ( Sivaji )పనితనం ఏంటో తేలుతుంది.

ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే ఓటింగ్‌తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది.

ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్‌ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

వైసీపీ ఎందుకు ఓడిందో చెప్పిన ఉండవల్లి