Rahul Sipligunj: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను ఉద్దేశించి స్టోరీ పోస్ట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్.. 6 ఏళ్ళ తర్వాత అంటూ?
TeluguStop.com
సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగులో ఎన్నో పాటలు పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేర్పరుచుకున్నారు రాహుల్.
అలాగే బిగ్ బాస్ సీజన్ 3 కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రాహుల్ సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో( Bigg Boss 7 ) నటి రతిక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా రతిక - రాహుల్ గతంలో ప్రేమించుకొని, పెళ్లికి కూడా రెడీ అయ్యి కొన్ని కారణాలతో విడిపోయారని సమాచారం.
"""/" /
అయితే తొలివారం హౌసులో బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుని కాస్త బాధపడ్డ రతిక( Rathika ) తాజాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకుండా అతడి గురించి మాట్లాడుకుంటున్నారని శివాజీ( Sivaji ) దగ్గరకొచ్చి కాస్త బాధపడింది.
అయితే రతిక ఇలా చేయడంతో ఆమె పేరు ఎత్తకుండా రాహుల్ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు.
ఆ పోస్ట్ ని బట్టి చూస్తే అది పరోక్షంగా రతిక గురించే అని డౌట్ రాక మానదు.
ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్‌తోనే పైకి రావాలనుకుంటారు.
కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు.గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు.
"""/" /
ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్.కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్ అని రాహుల్ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు.
దీంతో ఈ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.చాలామంది ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇది రతిక ని ఉద్దేశించి రాహుల్ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విషయానికి వస్తే.మొదటి వారం కాస్త చప్పగానే సాగినప్పటికీ రెండవ వారం మూడో వారం మాత్రం రసవత్తరంగా సాగుతోంది.
అప్పుడే చూస్తుండగానే బిగ్ బాస్ షో మూడవ వారం చివరి దశకుచేరుకుంది.ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్30, సోమవారం 2024