Nagarjuna : బిగ్ బాస్ 7 సీక్రెట్ ని బయటపెట్టేసిన నాగార్జున.. ఈసారి భిన్నంగా ఉండబోతుందంటూ?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో విశేషమైన ప్రేక్షకాధరణను దక్కించుకుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss 7 )ప్రారంభం కానుంది.
ఇటీవల బిగ్ బాస్ షోకి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది.
ఈ సీజన్ లో కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. """/" /
ఇది ఇలా ఉంటే ఇటీవలే నాగార్జున( Nagarjuna )తో కలిసి ఉన్న ప్రోమోని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ ప్రోమోలో నాగార్జున కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఒక పాట పాడి ముగించారు.
అయితే ఆ పాట వెనుక ఉన్న సీక్రెట్ ని తాజాగా రివీల్ చేశారు నాగార్జున.
బిగ్‌బాస్ షైనింగ్ స్టార్స్( Bigg Boss Shining Stars ) పేరుతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు.
గత ఆరు సీజన్ లలో పాల్గొన్న కొందరు పార్టిసిపెంట్స్‌ని తీసుకొచ్చి ఎంటర్‌టైన్ చేశారు.
అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో సందడి చేశారు.
ఇక కంటెస్టెంట్లు అందరూ ఆ తమదైన శైలిలో డాన్సులు వేసి ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.
"""/" /
నాగార్జున ఎంట్రీ ఇచ్చిన తర్వాత సుమ నాగార్జునని ప్రశ్నిస్తూ.కుడి ఎడమైతే.
అని టీజర్‌లో చెప్పారు కదా దానికి అర్థమేంటి అని అడగగా.దానికి నాగ్ బదులిస్తూ నాగ్.
న్యూ గేమ్ న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్ అని చెప్పుకొచ్చారు.దాంతో అక్కడున్నా గత సీజన్ల కంటెస్టెంట్లు వావ్ అంటూ చెప్పట్లు కొట్టారు.
అయితే నాగార్జున చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు రకరకాల టాస్కులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ఆ న్యూ రూల్స్ ఏంటి, న్యూ గేమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.
ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?