Pallavi Prashanth : ట్రాక్ తప్పుతున్న పల్లవి ప్రశాంత్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసుకుని హద్దులు దాటుతున్నాడా?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) రసవత్తరంగా సాగుతోంది.

చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా హౌస్ లో ఏడవారం నామినేషన్స్ కాస్త హీట్ గా సాగాయి.

రైతుబిడ్డ ప్రశాంత్ ( Prashanth )అయితే అపరిచితుడులా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు.చెప్పేది వినకుండా అర్థం చేసుకోకుండా ఏదేదో అరుస్తూ రెచ్చిపోయాడు.

అలాగే శివాజీ విషయంలోనూ అందరికీ చిన్న షాక్ తగిలింది.సోమవారం ఎపిసోడ్ మొదలైంది.

"""/" / ఆరవ వారం ఎలిమినేషన్ లో భాగంగా నయని పావని ( Nayani Pavani )వెళ్లిపోవడంతో అందరూ అలానే షాక్‌లో ఉండిపోయారు.

ఉదయానికి మళ్లీ నార్మల్ మూడ్‌లోకి వచ్చేశారు.ఐదోవారం ఒక గేమ్‌లో భాగంగా శివాజీ భుజానికి గాయమైంది.

దాదాపు 10 రోజులకు పైగా అలానే మెంటైన్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు అతడిని ఎక్స్‌రే తీసేందుకు బయటకు తీసుకెళ్లి మళ్లీ రాత్రికి తిరిగి తీసుకొచ్చేశారు.

ఆ తర్వాత రైతుబిడ్డ ప్రశాంత్ సందీప్ కెప్టెన్సీ సరిగా చేయలేకపోయావ్ కదా అని అన్నాడు.

అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించి సందీప్ తనని ఊరోడు అన్నాడని గట్టిగా అరుస్తూ చెప్పాడు.

"""/" / అయితే ఇది నిజమైతే పొలం, తినే అన్నంపై ఒట్టు వేయ్ అని సందీప్ అడగ్గానే మళ్లీ మాట మార్చేశాడు.

రైతు అనేవాడు పొలంపై ఒట్టు వేయడు అని ఏదేదో చెప్పి కాస్త అతి చేశాడు.

సందీప్ మాట్లాడుతుంటే అతడు చెబుతున్నది వినకండా పదే పదే మాటలకు అడ్డు తగిలాడు.

ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ కూల్ గా ఉండటానికి ట్రై చేస్తే ప్రశాంత్ మాత్రం ఫుటేజీ ఇవ్వడానికి ప్రయత్నించాడా అనే డౌట్ రాక మానదు.

మొత్తానికి పల్లవి ప్రశాంత్ బిహేవియర్ చూస్తుంటే ట్రాక్ తప్పుతున్నాడని, తన అభిమానుల అండ చూసుకొని రెచ్చి పోతున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!