Amardeep: రూ.45 లక్షలు ఇస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతా.. అమర్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.

నేటితో బిగ్ బాస్ షో విజేత ఎవరో తెలియనుంద.అయితే ఫినాలే ఎపిసోడ్ అంటే ప్రేక్షకులలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులలో హడావిడి మాములుగా ఉండదు.

కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season 7 ) చూస్తే మాత్రం అలాంటి పరిస్థితులు ఏవి కనిపించడం లేదు.

మరి తాజాగా శనివారం అనగా 104వ రోజు జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నేడు అనగా ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ దీంతో నాగార్జున శనివారం రోజు రాలేదు.

ఇక ఇంట్లో ఉన్న ఆరుగురి తోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్‌బాస్ చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు.

"""/" / కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఒక గేమ్ పెట్టాడు.

ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు.ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్‌బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌ లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్, అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక చేసి ఫుల్ మార్కులు కొట్టేశారు.

తర్వాత త్వరలో ప్రారంభమయ్యే సూపర్ సింగర్ కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది.

ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిపించింది.ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఒక ప్రశ్న అడగ్గా బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు.

"""/" / రతిక ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు.

అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్, అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు.

ప్రతి సీజన్‌లో ఉన్నట్లే ఫినాలేకి ఒక రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్ డబ్బుల సూట్‌కేస్ పంపించాడు.

రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు.

ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు.రూ.

3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్ వరసగా రూ.5 లక్షలు, రూ.

8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది.

కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.ఈ మొత్తం మంచి టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు.

అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ అర్జున్, అమర్‌తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు.

ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు.తనకు రూ.

40 లక్షలిస్తే పోతానని అర్జున్ రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్( Amardeep Chowdary ) అన్నాడు.

ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది.