Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారంతే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో( Bigg Boss 7 ) ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

వారందరూ మొదట పెద్దగా ఎవరికీ తెలియని ముఖాలు.అయితే ఈ కంటెస్టెంట్స్ అందరూ కెరీర్ లైఫ్ పై ఫోకస్ చేస్తూనే ఉన్నత చదువులు చదువుకున్నారు.

వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం పదండి.ప్రియాంక జైన్( Priyanka Jain ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ జానకి కలగనలేదు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది.

నటనలోనే కాకుండా చదువుల్లో కూడా ఈమె రాణించింది.ఈ సీరియల్ నటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

"""/" / జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోగా చేసిన అమర్‌దీప్( Amardeep ) కూడా పెద్ద చదువే చదివాడు.

అతను బీటెక్ పూర్తి చేశాడు.కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బాగా పాపులర్ అయిన శోభా శెట్టి( Sobha Shetty ) సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో ఎంఎస్సీ చేసింది.

ఉన్నత చదువే చదివినా యాక్టింగ్ పై మక్కువతో ముఖానికి మేకప్ వేసుకోవడానికి కూడా రెడీ అయింది.

క్యూట్ గా కనిపించే రతిక( Rathika ) బీటెక్ చదువుకుంది.చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తార ఏకంగా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ పట్టేసింది.

ప్రముఖ సింగర్ దామిని( Singer Damini ) డిగ్రీ పూర్తి చేసింది.బాడీ బిల్డర్ ప్రిన్స్‌ యావర్( Prince Yawar ) కూడా డిగ్రీ కంప్లీట్ చేశాడు.

"""/" / ఆట సందీప్‌( Aata Sandeep ) గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా గౌతమ్‌ కృష్ణ ఎం.

బీ.బీ.

ఎస్ చేశాడు.రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) డిగ్రీ పూర్తి చేశాడు.

శుభశ్రీ రాయగురు ఎల్.ఎల్.

బీ చదువుకుంది.సీనియర్ నటుడు శివాజీ( Sivaji ) గ్రాడ్యుయేషన్ చేశాడు.

ఇంకా షకీలా, కిరణ్ తదితరుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలియ రాలేదు.ఇలా చదువుకోకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బి గ్రేడ్ మూవీస్ లో మాత్రమే కాకుండా జయం, శ్రీరామచంద్రులు వంటి మంచి సినిమాల్లో నటించే ఆకట్టుకుంది.

కిరణ్ రాథోడ్ కూడా చెప్పుకోదగిన సినిమాల్లో నటించి సక్సెస్‌ ఫుల్ నటిగా తన సత్తా చాటింది.

మొత్తం మీద ఈసారి ఫస్ట్ రోజు హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ జీవితంలో ఏదో ఒకటి సాధించారు.

భవిష్యత్తులో వారు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, మంగళవారం 2024