Tejaswini Gowda : అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూనే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తేజస్విని గౌడ?
TeluguStop.com
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 గురించి మనందరికి తెలిసిందే.బిగ్ బాస్ షో కోట్లాటలు గొడవలు అరుపులతో రసవత్తరంగా సాగుతోంది.
ఇకపోతే హౌస్ లోకి సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి ( Amardeep Chowdary )ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
హౌస్ లో అమర్ దీప్ గేమ్ ఎలా ఆడుతున్నాడు ఇవన్నీ పక్కన పెడితే బయట తన తల్లి భార్యపై చాలామంది కావాలని దారుణమైన ట్రోల్స్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమర్ తల్లి మొన్న ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అమర్ భార్య తేజస్విని గౌడ కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. """/" /
కాగా గత రెండు వారాలుగా అమర్ దీప్ ఆటలో బాగా మార్పు వచ్చింది.
టాస్కుల్లోనూ సత్తా చాటుతున్నాడు.అందుకే ఇప్పటివరకు అతనిని వాయించేస్తోన్న నాగార్జున( Nagarjuna ) సైతం ఈ సీరియల్ నటుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
వెల్ డన్ అమర్ దీప్.అదరగొట్టేశావ్ అంటూ శనివారం నాటి ఎసిపోడ్‌లో నాగ్ వ్యాఖ్యానించారు.
దీంతో అమర్ దీప్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.ఇక అందరి కంటే అతని భార్య నటి తేజస్విని గౌడ( Tejaswini Gowda ) ఫుల్ ఖుషీ అయ్యిందని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్‌లో తన భర్తకు జరిగిన అవమానాలన్నింటినీ గుర్తు చేస్తూ ఒక్క పోస్ట్‌తో అందరికీ సమాధానం చెప్పింది.
"""/" /
బిగ్ బాస్ లోకి అమర్ ఎంట్రీ ఇవ్వడం, టాస్కుల్లో ఓడిపోయి నిరాశగా ఉన్న క్లిప్స్ దగ్గరి నుంచి బాగా ఆడి నాగార్జున దగ్గరి నుంచి ప్రశంసలు అందుకున్న సీన్స్ అన్నింటినీ కలిపి ఒక వీడియోను రూపొందించిన తేజస్విని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెల్ డన్ అమర్.పడ్డోడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.
మంచి పనులు జరగడానికి కొంచెం సమయం పడుతుంది.కాబట్టి ధైర్యంగా ఉండు.
బాగా ఆడు.నువ్వు గెలవగలవు.
నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటూ ఎమోషనల్ వర్డ్స్‌ను రాసుకొచ్చింది తేజస్విని.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.దీనిని చూసి నెటిజన్లు కూడా అమర్ దీప్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
మేమంతా ఉన్నామంటూ ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
యంగ్ హీరోల్లో రామ్ బాగా వెనకబడ్డాడా..?