ప్రిన్స్ యావర్ ని అందరూ కావాలనే టార్గెట్ చేస్తున్నారా..? రతికా మామూలు కన్నింగ్ కాదుగా!

రెండు వారల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఈ సీజన్ లో టాస్కులు సరికొత్త పద్దతి లో ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కంటెస్టెంట్స్ అప్పుడే ఫైనల్స్ వచ్చేసాయి అనే రేంజ్ లో పోటీ పడుతున్నారు.అయితే ఈ సీజన్ లో ముందు సీజన్స్ లాగ కెప్టెన్సీ అనే కాన్సెప్ట్ ని తీసిపారేసి, 'పవర్ అస్త్ర'( Power Astra ) అనే కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారు.

ఈ పవర్ అస్త్ర ని సంపాదించే వరకు కంటెస్టెంట్స్ ఎవ్వరూ ఇంటి సభ్యులు కాలేరు.

ఇప్పటి వరకు కేవలం శివాజీ మరియు సందీప్ మాత్రమే ఈ పవర్ అస్త్ర ని గెలుచుకున్నారు.

ఇక ఈ వారం పవర్ అస్త్ర టాస్క్ కి కంటెండర్లు గా ప్రిన్స్ యావర్, ప్రియాంక మరియు శోభా శెట్టి నిలిచారు.

వీరిలో కేవలం ప్రియాంక మరియు శోభా శెట్టి మాత్రమే ఫైనల్ 'పవర్ అస్త్ర' పోటీదారులుగా నిలిచారు.

వీరిలో ఎవరు గెలిచారు అనేది ఈరోజు రాత్రి తెలియనుంది.ఇదంతా పక్కన పెడితే ప్రిన్స్ యావర్ కి( Prince Yawar ) ఈ వారం పవర్ అస్త్ర దక్కడం న్యాయం అని ఇంట్లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా అనుకున్నారు.

ఎందుకంటే అతను పడిన రేంజ్ కష్టం, ఏ కంటెస్టెంట్ కూడా పడలేదు అనేది నిజం.

"""/" / పవర్ అస్త్ర కి కంటెండర్ అయ్యే ముందు అతను తనని తానూ నిరూపించుకునే ప్రక్రియ లో దామిని( Damini ) మరియు రతికా( Rathika ) నుండి ఘోరమైన టార్చర్ ఎదురుకున్నాడు.

అయినా కూడా సిల్లీ రీజన్స్ తో అతనిని పవర్ అస్త్ర టాస్క్ నుండి తప్పించినట్టు అందరికీ అనిపించింది.

వీళ్లందరికంటే యావర్ కి డేంజరస్ కంటెస్టెంట్ రతికా.ఈమె మంచిగా ఉన్నట్టు నటిస్తూనే వెన్ను పోటు పొడవడం లో సిద్దహస్తురాలు అని నెటిజెన్స్ దగ్గర పేరు తెచ్చుకుంది.

హౌస్ లోకి వచ్చిన మెడలో ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన ప్రశాంత్ తో మంచిగా ఉన్నట్టు నటించింది.

అతను దానిని ప్రేమ అనుకున్నాడు, """/" / అలా అనుకున్నప్పుడు అతనిలో ఆశలు తగ్గించాల్సింది పోయి, పులిహోర కలిపి అతన్ని వీక్ చేసింది.

చివరికి నామినేషన్స్ లో నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు ?, పులిహోర కలపడానికా అని అతన్ని నామినేట్ చేసింది.

ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో కూడా అదే చేస్తుంది.అతనితో మంచి గా ఉన్నట్టు నటించి, పవర్ అస్త్ర టాస్కు కి అనర్హుడు అని ఓటు వేసి, మళ్ళీ అతని వద్దకి వచ్చే అతని ప్లేట్ లో అన్నం తింటుంది.

యావర్ హౌస్ మేట్స్ తో కంటే ముఖ్యంగా ఈమె ట్రాప్ లో నుండి బయట పడితే కానీ, టాప్ 5 లో ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.

చైనా: ఇంటర్నెట్ కేఫ్‌లో చనిపోయిన వ్యక్తి.. 30 గంటలైనా గుర్తించని సిబ్బంది..